
ఇటివల కాలంలో దేశంలో బాంబు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అనేక ప్రాంతాల్లో స్కూల్స్, మాల్స్, ఆస్పత్రులు, విమానాల్లో బాంబులు ఉన్నాయని బెదిరింపులు వస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా ఎయిరిండియా విమానంలో బాంబు ఉన్నట్లు బెదిరింపులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన అధికారులు ప్రయాణికులను హడావుడిగా విమానం నుంచి దించేశారు.
విమానంలో బాంబు ఉందన్న సమాచారం అందిన వెంటనే అధికారులతోపాటు ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. గురువారం ముంబై నుంచి తిరువనంతపురం వెళ్తున్న విమానానికి ఈ ముప్పు రావడంతో తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో పూర్తి అత్యవసర పరిస్థితిని అధికారులు ప్రకటించారు.
ఉదయం 8 గంటలకు విమానాన్ని విమానాశ్రయంలో ల్యాండ్ చేసి, ఐసోలేషన్ బేకు తరలించినట్లు అధికారులు తెలిపారు. ప్రయాణికులను విమానం నుంచి బయటకు పంపించినట్లు చెప్పారు. తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న క్రమంలో పైలట్‌కు ఉదయం 7.30 గంటలకు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో విమానాశ్రయ అధికారులు అప్రమత్తమయ్యారు.
ల్యాండ్ అయిన వెంటనే ఫ్లైట్ ఉదయం 8 గంటలకు ఐసోలేషన్ బేకు తరలించారు. 8.44 గంటలకు ప్రయాణికులను సురక్షితంగా ఫ్లైట్ నుంచి బయటకు తీసుకువచ్చారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని విమానాశ్రయ అధికారులు ప్రకటించారు. అయితే, విమానాశ్రయంలో కార్యకలాపాలు యధావిధిగా కొనసాగుతున్నాయని వెల్లడించారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా