రుణమాఫీ చేసినందుకు హరీష్‌రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలోనే వచ్చిన వారిని అడ్డుకోవడానికి బీఆర్‌ఎస్ కార్యకర్తలు రావడంతో హరీష్ ఆఫీస్ దగ్గర అర్ధరాత్రి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను బయటకు పంపించేశారు.
ఈ ఘటనపై ఎమ్మెల్యే హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ గుండాలు క్యాంప్ ఆఫీస్ పై దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. అర్ధరాత్రి దాడి చేయడాన్ని చూస్తే తీవ్ర ఆందోళనలను రేకెతుస్తోందని ఓ వీడియోను పోస్టు చేశారు. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇలా దాడి చేస్తే సామాన్యలు భద్రతకు ప్రభుత్వం ఏం భరోసా ఉంటుందని ప్రశ్నించారు. పోలీసుల సమక్షంలోనే ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని హరీశ్ రావు స్పష్టం చేశారు.
“ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాలు దాడి చేసి తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం.. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? పోలీసుల సమక్షంలో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసి ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం కాంగ్రెస్ మార్క్ పాలనకు నిదర్శనం. వెంటనే ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.

More Stories
ఖమ్మంలో సీపీఎం నేత దారుణ హత్య
అజారుద్దీన్‌కు మంత్రిపదవితో కాంగ్రెస్ లో అసమ్మతి కుంపటి!
ప్రభుత్వ నిర్లక్ష్యంతో ధాన్యం తడిచి రైతులు విలవిల