స్విస్ కోర్టులో వినేశ్ ఫోగట్‌ మెడల్ పై సవాల్

స్విస్ కోర్టులో వినేశ్ ఫోగట్‌ మెడల్ పై సవాల్

భారత మహిళా రెజ్లర్‌ వినేశ్ ఫోగట్‌ అప్పీల్‌ను  ఆర్బిట్రేషన్‌ కోర్టు తిరస్కరించినా ఆమెకు ఇంకా పతకం అందుకునే అవకాశం ఉందా ముగిసిపోలేదని చెబుతున్నారు.  కాస్‌ నిర్ణయాన్ని సైతం సవాల్‌ చేసే అవకాశం ఉంది. కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ బుధవారం అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ, యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ కి అనుకూలంగా తీర్పునిచ్చింది. 

అయితే, కాస్‌ నిర్ణయాన్ని స్విస్‌ కోర్టులో సవాల్‌ చేసేందుకు అవకాశాలున్నాయి. స్పోర్ట్స్ ట్రిబ్యునల్ ఏదైనా నిర్ణయాన్ని సవాల్‌ చేయవచ్చు కానీ. చాలా పరిమిత కారణాలపై మాత్రమే. వినేశ్‌ విజ్ఞప్తిని తిరస్కరించిన అనంతరం భారత ఒలింపిక్‌ సంఘం ప్రెసిడెంట్‌ పీటీ ఉష అధికారిక ప్రకటనలో ప్రస్తుతం న్యాయపరమైన అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపింది.

వినేశ్‌ ఫోగట్‌ మహిళల 50 కిలోల ఫ్రీ స్టయిల్‌ ఈవెంట్‌లో గత మంగళవారం జపాన్‌కు చెందిన యుయి సుసాకీపై విజయంతో ఫైనల్‌కు చేరింది. ఫైనల్‌లో స్వర్ణ పతకం కోసం అమెరికాకు చెందిన సారా హిల్డెబ్రాండ్‌తో పోటీపడాల్సి ఉండగా.. అధిక బరువు కారణంగా అనర్హత వేటుపడింది. గత బుధవారం స్పోర్ట్స్ ఆర్బిట్రేషన్‌లో వినేశ్‌ అప్పీల్‌ చేసింది. 

క్యూబా రెజ్లర్ యుస్నెలిస్ గుజ్మాన్ లోపెజ్‌తో కలిసి సంయుక్తంగా సిల్వర్‌ మెడల్‌ ఇవ్వాలని కోరింది. గుజ్మాన్‌ లోపెన్‌ వినేశ్‌ చేతిలో సెమీ ఫైనల్‌లో ఓటమి పాలైన విషయం తెలిసిందే. కానీ తర్వాత వినేశ్‌పై అనర్హతతో గుజ్మాన్‌ ఫైనల్‌లో చోటు దక్కించుకుంది.  వినేశ్‌ అప్పీల్‌లై కాస్‌లో సీనియర్‌ న్యాయవాదులు హరీశ్‌ సాల్వే, విదుష్పత్‌ సింఘానియా వాదనలు వినిపించారు. వినేశ్‌ లీగల్ టీమ్‌లో ఫ్రెంచ్ న్యాయవాదులు జోయెల్ మోన్లూయిస్, ఎస్టేల్ ఇవనోవా, హబిన్ ఎస్టేల్ కిమ్, చార్లెస్ అమ్సన్ ఉన్నారు. వినేశ్‌ అప్పీల్‌కు భారత ఒలింపిక్‌ సంఘం సహకారం అందించింది.