
నవ జె ఠాకూరియా
గౌహతి కేంద్రంగా సీనియర్ జర్నలిస్ట్
వరుసగా నాలుగోసారి ఎన్నికలలో ప్రధానమంత్రిగా గెలుపొందిన కొద్దీ నెలలకే ఢాకాలోని ప్రధానమంత్రి కార్యాలయం నుండి ఆకస్మికంగా దేశం విడిచివచ్చి భారత్ లో ఆశర్యం పొందాల్సి వచ్చిన `బంగా బంధు’ షేక్ ముజిబుర్ రెహమాన్ కుమార్తె షేక్ హసీనా కోసం మరిన్ని కష్టాలు ఎదురు చూస్తున్నాయి. ఆమెపై ఇప్పుడు స్వదేశంలో అనేక మంది పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. జులై 1 నుంచి ఆమె దేశం విడిచిపెట్టిన ఆగష్టు 5 వరకు యువకులైన విద్యార్థులతో పాటు వందలాది మంది పౌరుల మృతికి సంబంధించి ఆమె హత్యారోపణలను ఎదుర్కొంటున్నారు.
కాబట్టి ఆమె అవామీ లీగ్ చీఫ్ వెల్లడించినట్లు ఆమె వెంటనే స్వదేశంకు తిరిగి రావడం ఇప్పుడు మరింత కష్టమవుతుంది. ఇటీవల, అప్పటి పశ్చిమ పాకిస్తానీ దళాలకు వ్యతిరేకంగా 1971 విముక్తి ఉద్యమం యుద్ధ నేరస్థులకు న్యాయనిర్ణేతగా హసీనా స్వయంగా పునర్నిర్మించిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ఐసిటి), హసీనాతో పాటు మరికొందరిపై మారణహోమానికి సంబంధించిన ఆరోపణలతో దర్యాప్తు ప్రారంభించింది. ప్రభుత్వ ఉద్యోగ-కోటా వ్యతిరేక నిరసన ప్రదర్శన సమయంలో హసీనా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దారితీసిన ఉద్యమం సందర్భంగా జరిగిన `మారణహోమం’కు సంబంధించి ఈ ఆరోపణలు చేశారు.
ఢాకాలో జరిగిన నాటకీయ పరిస్థితిలో, హసీనా రాజీనామా చేసి భారతదేశంలో తాత్కాలిక ఆశ్రయం పొందవలసి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఏ ప్రభుత్వం ఆమెకు సురక్షితమైన మార్గాన్ని అందించలేదు. హసీనా, ఆమె మంత్రివర్గం, పార్టీలో ఆమె విశ్వసనీయ సహచరులపై ఐసిటిలో పిటిషన్‌ను మహమ్మద్ బుల్బుల్ కబీర్ (ఉద్యోగ కోటా సంస్కరణ ఉద్యమంలో మరణించిన 9వ తరగతి విద్యార్థి ఆరిఫ్ అహ్మద్ సియామ్ తండ్రి), హసీనా, మరికొందరిపై ఆరోపణలు చేశారు.
నిరసనకారులపై హింసాత్మక అణిచివేతకు ఆదేశించడం వల్ల అనేక మంది విద్యార్థులు మరణించారు. అంతకుముందు, ఫైజుల్ ఇస్లాం రాజోన్ బంధువు (ఢాకా మోడల్ డిగ్రీ కళాశాల విద్యార్థి) ఉద్యమం సమయంలో పోలీసు కాల్పుల్లో మరణించాడని అధికారులపై ఫిర్యాదు చేశాడు. అబూ సైద్ అనే వ్యాపారి హత్య తర్వాత మరో కేసు నమోదైంది.
ఈ ఏడాది జనవరి 7న జరిగిన గత సార్వత్రిక ఎన్నికలను బహిష్కరించిన ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బిఎన్ పి), అశాంతి సమయంలో జరిగిన అన్ని హత్యలపై నిష్పక్షపాత దర్యాప్తును కూడా డిమాండ్ చేసింది. మాజీ ప్రధాని ఖలీదా జియా నేతృత్వంలో, ఆ పార్టీ ఆందోళన చేస్తున్న విద్యార్థులు, యువకుల ఊచకోతతో ప్రమేయం ఉన్న దోషులను గుర్తించడానికి ఐక్యరాజ్యసమితి ద్వారా విచారణ జరపాలని కూడా పట్టుబట్టింది. ప్ర
భుత్వ-ప్రాయోజిత మారణహోమం (హసీనా ప్రభుత్వం) అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నిష్పక్షపాత దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయబడాలని వాదిస్తూ, బిఎన్ పి నాయకత్వం ఆగస్టు 8న ప్రమాణస్వీకారం చేసిన బంగ్లాదేశ్‌లోని తాత్కాలిక ప్రభుత్వాన్ని విచారణను ఆమోదించవలసిందిగా కోరింది.
ఇంతలో, నోబెల్ గ్రహీత ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం హసీనా నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరిగిన సామూహిక తిరుగుబాటులో దాదాపు 600 మందిని చంపడంపై దర్యాప్తు ప్రారంభించాలని నిర్ణయించింది. బంగ్లాదేశ్ అత్యున్నత న్యాయస్థానంలోని బార్ అసోసియేషన్ ఇప్పటికే హసీనా, ఆమెతో పాటు ఉన్న సోదరి రెహానాను అరెస్టు చేసి విచారణ కోసం ఢాకాకు తిరిగి పంపాలని న్యూఢిల్లీని కోరింది.
అవామీ లీగ్ మరియు ,దాని అనుబంధ సంఘాలైన చత్రా లీగ్, జుబా లీగ్‌ల కార్యకర్తలతో పాటు చట్టం అమలు సంస్థలు నిరసనకారులను హింసాత్మకంగా లక్ష్యంగా చేసుకున్నారని ఫోరమ్ పేర్కొంది. ఇటీవల, ఐరాస మానవ హక్కుల చీఫ్ వోల్కర్ టర్క్ ప్రొఫెసర్ యూనస్‌తో మాట్లాడుతూ జూలై 1 నుండి ఆగస్టు మొదటి వారం వరకు విద్యార్థుల ఆందోళన సందర్భంగా దేశంలో విస్తృతంగా జరిగిన మానవ హక్కుల ఉల్లంఘనలపై దర్యాప్తు చేయడానికి బంగ్లాదేశ్‌కు నిజనిర్ధారణ బృందాన్ని పంపడానికి అంగీకరించారు.
యాదృచ్ఛికంగా 1971లో బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం పొందిన తర్వాత ఐరాసా నిజనిర్ధారణ మిషన్‌ను పంపడం ఇదే మొదటి సందర్భం. బంగ్లాదేశ్ విద్యార్థులు తమ చట్టబద్ధమైన హక్కుల కోసం చేస్తున్న ఉద్యమానికి మద్దతిచ్చినందుకు ఐరాసా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్‌కి ప్రొఫెసర్ యూనస్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి పౌరుని రక్షణ తాత్కాలిక ప్రభుత్వపు ప్రధాన ప్రాధాన్యతగా ఉందని పేర్కొంటూ, ప్రొఫెసర్ యూనస్ దేశ పునర్నిర్మాణం కోసం ఐరాసా సహకారాన్ని కూడా కోరారు.
అంతకుముందు, అమ్నెస్టీ ఇంటర్నేషనల్ బంగ్లాదేశ్ అధికారులను హిందూ, ఇతర మైనారిటీ వర్గాలపై నేరాలు, మూక హింసకు సంబంధించిన సంఘటనలపై ‘వేగవంతమైన, క్షుణ్ణమైన, నిష్పాక్షిక, స్వతంత్ర దర్యాప్తు’ నిర్వహించాలని కోరింది. బంగ్లాదేశ్ గతంలో చూసిన రాజకీయ ప్రత్యర్థులపై దాడి చేసే ప్రతీకార సంస్కృతికి స్వస్తి పలికి, ప్రతి ఒక్కరికీ సమానత్వం, వివక్ష రహితం, శారీరక సమగ్రతకు సంబంధించిన హక్కులను తాత్కాలిక ప్రభుత్వం నిర్ధారించాలి.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు