తిరుమల క్షేత్రం నుంచే దేవదాయ శాఖలో ప్రక్షాళన మొదలైందని మంత్రి ఆనం పేర్కొన్నారు. ఆలయాల నిర్వహణలో ఏ చిన్న ఆరోపణలు వచ్చినా నివేదికలు తెప్పించుకని, అధికారుల పనితీరును మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో కృష్ణా, గోదావరి సంగమం వద్ద జలహారతి పునరుద్దరిస్తామని చెప్పా రు.
గత ప్రభుత్వం తిరుమల నుంచి అరసవల్లి వరకు దేవాలయాల భూములు అన్యాక్రాంతం చేసిందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంలో ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రజాగళం, యువగళంలో వచ్చిన వినతులను పరిష్కరిస్తున్నామని చెప్పారు.
నెల్లూరు జిల్లాలో రెండు దేవాలయాల్లో పొరపాట్లు జరిగినట్లు గుర్తించి ఐదుగురు అధికారులను సస్పెండ్ చేసినట్లు మంత్రి తెలిపారు. వారిపై విచారణ కొనసాగుతోందని చెబుతూ తప్పులు చేసిన వారిని వదిలే ప్రసక్తే లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని కొన్ని ఆలయాలను పునర్నిర్మించడానికి నిర్ణయించినట్లు చెప్పారు.

More Stories
పరకామణి కేసులో ఫిర్యాదు చేసిన అధికారి మృతి
ఏపీలో వ్యాపారానికి ప్రశాంతమైన వాతావరణం
మాజీ మంత్రి పెద్దిరెడ్డిపై అటవీ భూముల ఆక్రమణ కేసు