కేరళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం

కేరళకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం
* వయనాడ్‌లో ప్రధాని మోదీ ఏరియల్‌ సర్వే

కొండచరియలు విరిగిపడి వరదలు పోటెత్తటంతో అతలాకుతలమైన కేరళకు అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని ప్రధాని నరేంద్రమోదీ హామీ ఇచ్చారు. ప్రకృతి విపత్తులో కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ప్రాణాలతో బయటపడినవారి గురించి ప్రతి ఒక్కరూ ప్రార్థిస్తున్నారని, అవి పలు కుటుంబాల కలలను ‘ఛిద్రం చేశాయ’ని ప్రధాని ఆవేదన వ్యక్తం చేశారు. 

కొండచరియలు విరిగిపడిన దుర్ఘటనలో ఇంత వరకు 226 మంది ప్రాణాలు కోల్పోగా, 130 మందికి పైగా గల్లంతు అయ్యారు. వాస్తవ పరిస్థితి సమీక్ష కోసం, కొండచరియల విలయ బాధితుల పునరావాసానికి ఒక ప్లాన్ రూపకల్పన కోసం వయనాడ్‌లోని జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడారు. విపత్తు ప్రదేశం సమీపంలో మకాం వేసి ఉన్న క్యాబినెట్ సబ్ కమిటీ మంత్రులు, సీనియర్ అధికారులు, స్థానిక పాలనా యంత్రాంగం అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు

విలయం సంభవించినప్పటి నుంచి తాను ‘ఇక్కడివారిని సంప్రదిస్తున్నాన’ని, నిరంతరం తాజా సమాచారం అందుకుంటున్నానని ఆయన తెలియజేశారు.ప్రాణాలతో బయటపడినవారి నుంచి వారు గమనించిన, అనుభవించినవాటి గురించి తాను విన్నానని ఆయన చెప్పారు. కొండ చరియలు విరిగిపడడాన్ని ప్రకృతి ‘ప్రకోపం’గా ఆయన అభివర్ణించారు.

అంతకు ముందు ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకుపోయిన, కొండచరియలు వల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేపట్టారు. హెలికాప్టర్‌ ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.  ప్రధాని వెంట కేరళ గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ ఖాన్‌, ముఖ్యమంత్రి పినరయి విజయన్‌, కేంద్ర మంత్రి సురేశ్‌ గోపి, స్థానిక అధికారులు ఉన్నారు.

కొండచరియలు విరిగిపడిన ముండక్కై, చురాల్‌మల తదితర ప్రాంతాల్లో ప్రధాని ఏరియల్ సర్వే చేశారు. చూరల్‌మల, ముందక్కై, పంచరిమట్టం తదితర ప్రాంతాల్లో జరిగిన నష్టాన్ని వీక్షించారు. అనంతరం వయనాడ్‌లోని కాల్పెట్టాలో దిగి రోడ్డు మార్గంలో చూరల్‌మలకు వెళ్లారు. అక్కడ సహాయకచర్యల్లో భాగంగా ఆర్మీ నిర్మించిన 190 అడుగుల బెయిలీ బ్రిడ్జిపై నడిచి పరిసరాల్లో సంభవించిన నష్టాన్ని పరిశీలించారు.

అక్కడ విలయం తరువాత సైన్యం నిర్మించిన 190 అడుగుల నిడివి బెయిలీ వంతెనపై నడుస్తూ విపత్తు నష్టాన్ని సర్వే చేశారు. జూలై 30 నాటి విలయంలో నష్టాన్ని స్వయంగా చూసేందుకు చూరల్‌మల మీదుగా ఆయన నడిచారు. స్థానికంగా ఏర్పాటైన పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటున్న బాధితులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.

సర్వం కోల్పోయిన కుటుంబసభ్యులను, జరిగిన నష్టాన్ని తల్చుకొని కన్నీరుమున్నీరైన పలువురిని ప్రధాని మోదీ ఓదార్చారు.  అక్కడ విలయం తరువాత సైన్యం నిర్మించిన 190 అడుగుల నిడివి బెయిలీ వంతెనపై నడుస్తూ విపత్తు నష్టాన్ని సర్వే చేశారు. జూలై 30 నాటి విలయంలో నష్టాన్ని స్వయంగా చూసేందుకు చూరల్‌మల మీదుగా ఆయన నడిచారు.