
* హనియా హత్యకు ప్రతీకారం
హనియా హత్యకు ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడి చేయాలని ఖమేనీ ఆదేశించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. హనియా మృతి తర్వాత బుధవారం ఇరాన్ భద్రతా మండలి అత్యవసరంగా సమావేశమైంది. ఆ సమావేశంలోనే ఇజ్రాయెల్‌పై దాడి చేయాలని ఖమేనీ ఆదేశాలు ఇచ్చారని ది న్యూయార్క్ టైమ్ నివేదించింది. కీలక అధికారుల సమాచారాన్ని ఊటంకిస్తూ కథనం ప్రచురించింది.
హమాస్ పొలిటికల్ చీఫ్ ఇస్మాయిల్ హనియా ఇరాన్లో హత్యకు గురయ్యాడు. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై బుధవారం తెల్లవారక ముందు 2 గంటల సమయంలో జరిగిన వైమానిక దాడిలో హనియా మరణించాడని ఇరాన్ ప్రభుత్వంతోపాటు హమాస్ గ్రూపు కూడా ధ్రువీకరించింది. దాడిలో హనియాతోపాటు ఆయన బాడీగార్డు కూడా మరణించాడని తెలిపాయి.
ఇరాన్ కొత్త అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ ప్రమాణ స్వీకారానికి హాజరై, ఇంటికి వచ్చిన తర్వాత ఈ దాడి జరిగినట్టుగా సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. లెబనాన్ రాజధాని బీరుట్లో ఇరాన్ మద్దతు గల హెజ్బొల్లా టాప్ కమాండర్‌ను హతమార్చినట్టు ఇజ్రాయెల్ మంగళవారం సాయంత్రం ప్రకటించగా, దానికి కొద్ది గంటల తర్వాతనే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
ఇక ఇజ్రాయెలే హనియాను హత్య చేసిందని ఇరాన్, హమాస్ ఆరోపించాయి. అయితే హనియా హత్యపై స్పందించేందుకు ఇజ్రాయెల్ నిరాకరించింది. ఇక ఈ హత్యలో తమ ప్రమేయం లేదని అమెరికా పేర్కొన్నది. మరోవైపు ఇజ్రాయెల్‌పై ప్రతీకారం తప్పదని ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ హెచ్చరించారు. హనియా ప్రతీకారాన్ని తమ డ్యూటీగా తీసుకొంటామని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ కఠిన శిక్షకు సిద్ధంగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్‌పై ప్రత్యక్ష దాడికి ఆదేశించినట్లుగా తెలుస్తోంది.
More Stories
వారణాసిలో చదివిన నేపాల్ కాబోయే ప్రధాని కార్కి
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్, స్విట్జర్లాండ్‌లకు భారత్ హెచ్చరిక