
కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి, ప్రమాదాల సమయంలో వ్యక్తికి సహాయంగా నిలిచే ప్రీమియంపై పన్నును యూనియన్ వ్యతిరేకిస్తోందని కేంద్ర మంత్రి తెలిపారు. అలాగే వైద్య బీమా ప్రీమియంపై 18% జీఎస్టీ అనేది సమజసం కాదని చెప్పారు. ఇదొక సామాజిక అవసరం అని, కాబట్టి జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని కోరారు.
తనను కలిసిన యూనియన్ జీవిత బీమా ద్వారా పొదుపునకు అవకలన చికిత్స, ఆరోగ్య బీమా ప్రీమియం కోసం ఐటీ మినహాయింపులను తిరిగి ప్రవేశపెట్టడం, పబ్లిక్ సెక్టార్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీల ఏకీకరణకు సంబంధించిన అంశాలను కూడా లేవనెత్తిందని గడ్కరీ చెప్పారు.
“జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీ విధించడం అనేది అనిశ్చితిపై పన్ను విధించడం కిందకే వస్తుంది. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి తీసుకునే జీవిత బీమాపై పన్ను విధించకూడదని యూనియన్ భావిస్తోంది. అదేవిధంగా, వైద్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అనేది సమంజసం కాదు. సామాజికంగా అవసరమైన ఈ విభాగం వ్యాపార వృద్ధికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వీటిపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని యూనియన్ కోరుతోంది” అని ఆర్ధిక మంత్రికి వ్రాసిన లేఖలో నితిన్ గడ్కరీ వివరించారు.
పై విషయాలను దృష్టిలో పెట్టుకుని ప్రీమియంలపై జీఎస్టీ అనేది ముఖ్యంగా సీనియర్ సిటిజన్లకు ఇబ్బందికరంగా పరిణమించింది కాబట్టి జీఎస్టీ ఉపసంహరణ సూచనను పరిగణలోకి తీసుకోవాలని ఆర్థిక మంత్రిని నితిన్ గడ్కరీ అభ్యర్థించారు. వాస్తవానికి జీవిత, ఆరోగ్య బీమా పాలసీలు ఇప్పుడు ఒక తప్పనిసరి అవసరంగా మారిపోయాయి. కరోనా తర్వాత ఈ పాలసీలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది.
కానీ, పెరిగిన ప్రీమియంతో చాలా మంది బీమాకు దూరం అవుతున్నారు. జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై జీఎస్టీని అన్ని వర్గాల వారు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఆరోగ్య బీమా పాలసీలపై వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ను తగ్గించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జీవిత, ఆరోగ్య బీమా అనేవి ప్రతి ఒక్కరికీ తప్పనిసరి కాబట్టి వీటికి జీఎస్టీ మినహాయింపును ఇవ్వాలని కోరుతున్నారు.
More Stories
భీమస్మృతి మనకు మార్గదర్శకం, మనుస్మృతి కాదు
పంటలకు జీవ ఉత్ప్రేరకాలఅమ్మకంపై నిషేధం
ఉగ్రవాదంపై విజయానికి ప్రతీక ఆపరేషన్ సిందూర్