
‘పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ మీద మాకు గౌరవం ఉంది. ఆమెతో మేము చాలా సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాం. కానీ బంగ్లాదేశ్ ప్రజల పట్ల ఆమె చేసిన వ్యాఖ్యలు సరికాదు. ఆ వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. దీదీ ప్రకటనతో ఉగ్రవాదులకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఈ వ్యవహారంపై మేము భారత ప్రభుత్వానికి ఒక అధికారిక నోట్ పంపుతున్నాం’ అని ఆ దేశ విదేశాంగ మంత్రి హసన్ మహమూద్ తెలిపారు.
కాగా, ఇటీవలే నిర్వహించిన మెగా ర్యాలీలో దీదీ కీలక ప్రకటన చేశారు. బంగ్లాదేశ్ నుంచి రాష్ట్రానికి వచ్చిన వారికి ఆశ్రయం కల్పిస్తామని పేర్కొన్నారు. ఐక్యరాజ్యసమితి తీర్మానానికి అనుగుణంగా ఈ విషయంలో వ్యవహరిస్తామని తెలిపారు. ‘నేను బంగ్లాదేశ్ సార్వభౌమత్యం గురించి మాట్లాడటం లేదు. అది కేంద్రానికి సంబంధించినది. కానీ నిస్సహాయులైన ప్రజలు వస్తే మాత్రం మానవతా దృక్పథంతో స్పందిస్తాం’ అని ఆమె చెప్పారు. దీంతో దీదీ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి.
మరోవైపు ఈ వ్యాఖ్యలను కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. అలాంటి అధికారం రాష్ట్రాలకు ఉండదని స్పష్టం చేసింది. అటువంటి అధికారం కేంద్రానిదేనని, ఆమె వ్యాఖ్యలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని పేర్కొంది.
పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో ప్రస్తుత పరిస్థితులపై దేశ విదేశీ వ్యవహారాలను ప్రభావితం చేసే రాజకీయ ప్రేరేపిత ప్రజాకర్షక వ్యాఖ్యలు చేయవద్దని పశ్చిమ బెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కోరారు. దేశ విదేశీ వ్యవహారాలపై ప్రతికూల ప్రభావం చూపే వ్యాఖ్యలు అని పేర్కొంటూ రాజ్ భవన్ బుధవారం ఎక్స్ లో ఒక పోస్ట్‌లో పేర్కొంది.
బిజెపి నాయకుడు అమిత్ మాల్వియా సహితం ఎక్స్ లో తన హ్యాండిల్ నుండి హసన్ వ్యాఖ్యల వీడియోను కూడా పోస్ట్ చేసారు, “మమతా బెనర్జీ తరచూ వివాదాలకు కారణం అవుతూ ఉంటారు. ఇప్పుడు ఆమె పశ్చిమ బెంగాల్‌కే కాదు, ఇప్పుడు భారతదేశానికి కూడా మారారు” అంటూ అభ్యంతరం తెలిపారు.
More Stories
సుప్రీంకోర్టు శక్తి హీనురాలై, పని లేకుండా కూర్చోవాలా?
భారీ ఉగ్ర కుట్ర భగ్నం చేసిన ఢిల్లీ స్పెషల్ పోలీస్
కీలక నేత బాలకృష్ణతో సహా 10 మంది మావోయిస్టులు మృతి!