
నవంబర్ 6, 8 తేదీల్లో ఉద్యోగులు ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చని ముఖ్యమంత్రి కార్యాలయం గురువారం ఓ ప్రకటనలో తెలిపింది. ‘రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులు, అత్తమామలతో సమయం గడిపేందుకు హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని అస్సాం ప్రభుత్వం రెండు రోజులు ప్రత్యేక సెలవులు ప్రకటించింది. నవంబర్ 6, 8వ తేదీల్లో ఈ సెలవులను ఉద్యోగులు ఉపయోగించుకోవచ్చు’ అని పేర్కొంది.
అయితే, 7వ తేదీ ఛత్ పూజ , 9వ తేదీ రెండో శనివారం కావడంతో ఉద్యోగులకు మొత్తం నాలుగు రోజులు కలిసొచ్చిందని పేర్కొంది. ఈ సెలవులు వ్యక్తిగత ప్రయోజనం, వ్యక్తిగత ఆనందం కోసం మాత్రం ఉపయోగించుకోకూడదని హిమంత ప్రభుత్వం స్పష్టం చేసింది. కేవలం తల్లిదండ్రులు, అత్తమామలతో సమయం గడిపేందుకు మాత్రమే ఉపయోగించుకోవాలని సూచించింది. వారిని గౌరవించి, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొంది. తల్లిదండ్రులు, అత్తమామలు లేని ఉద్యోగులు ఈ సెలవులకు అర్హులు కాదని తన ప్రకటనలో స్పష్టం చేసింది.
More Stories
ప్రెస్ మీట్ లో ఫోన్ నెంబర్ ఇచ్చి చిక్కుల్లో రాహుల్!
ఢిల్లీ యూనివర్సిటీ ఎన్నికల్లో ఎబివిపి ఘన విజయం
బంధుప్రీతి లేని ఏకైక ప్రదేశం ‘సైన్యం’