సమావేశాల తొలిరోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగంతో ఇవి ప్రారంభమవుతాయి. తర్వాత రెండు రోజులపాటు గవర్నర్ ప్రసంగంపై సభలో చర్చ జరిపి దానిని ఆమోదిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్ధిక పరిస్థితిపై విడుదల చేస్తున్న శ్వేత పత్రాలను ఈ సమావేశాల్లో సభ ముందు ప్రవేశపెడ తారు. సమావేశాల్లో మూడు రోజులపాటు వాటిపై కూడా చర్చ జరుగుతుంది.
మొత్తం ఐదు రోజుల చర్చతో ఈ సమావేశాలు ముగుస్తాయి. మరోవైపు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టడానికి అనువైన పరిస్థితులు లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ ఎకౌంట్ బడ్జెట్‌ను మరో నాలుగు నెలలు పొడిగించే సూచనలు ఉన్నాయి.
కాగా ప్రస్తుత పరిస్థితుల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టే అంశంపై ఆర్థిక శాఖ తర్జన భర్జన పడుతోంది. దీంతో ప్రస్తుతం ఉన్న ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌నే కొనసాగిస్తూ ఆర్డినెన్స్ తీసుకొచ్చే అంశంపై ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నది. మరో 4 నెలల పాటు ఓటాన్ అకౌంట్ కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఆర్థిక శాఖ భావిస్తున్నట్టు సమాచారం.
కొంచెం ఆర్థిక వెసులుబాటు, వివిధ శాఖల్లోని ఆర్థిక పరిస్థితిపై స్పష్టత రావడానికి మరి కొంత సమయం పడుతుందని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. వాటిపై స్పష్టత వచ్చాక సెప్టెంబరులో పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఆర్థిక శాఖ ప్రవేశపెట్టే అవకాశాలున్నాయి. కాగా ఆర్డినెన్స్ పెట్టాలనే ప్రతిపాదనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమోదం కోసం ఆర్థిక శాఖ ఎదురు చూస్తోంది.

More Stories
పరకామణి కేసులో ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు
చిత్తూర్ మేయర్ దంపతుల హత్య కేసులో ఐదుగురికి ఉరిశిక్ష
భగవద్గీతపై టిటిడి ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యల దుమారం