
విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ భారతీయ ఈక్వి టీ మార్కెట్లలో పెట్టుబడులు పెంచారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2024- 25) లో భారీ అమ్మకాల తర్వాత విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదారులు (ఎఫ్‌పిఐలు) ఇప్పుడు కొనుగోళ్ల వైపు మళ్లా రు. భారత్ మార్కెట్లలో జూన్ నెలలో ప్రారంభమైన ఎఫ్‌పిఐల కొనుగోళ్లు, జూలై నెలలో కూడా కొనసాగుతున్నాయి.
జూలై మొదటి వారంలో ఎఫ్‌పిఐలు దాదాపు రూ.8 వేల కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఈ ఏడాది మొత్తం మీద విదేశీ పెట్టుబడులు రూ. లక్ష కోట్లకు పెరిగాయి. నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లి మిటెడ్ (ఎన్ఎస్డిఎల్) డేటా ప్రకారం, జూలై మొదటి వారంలో ఎఫ్‌పిఐల ద్వారా భారతీయ ఈక్విటీల్లో మొత్తం కొనుగోళ్లు రూ.7,962 కోట్లుగా ఉన్నాయి.
అంతకుముందు జూన్ నెలలో ఎఫ్‌పిఐలు రూ.25,565 కోట్ల విలువైన భారతీయ షేర్ల ను కొనుగోలు చేశారు. గత మూడు వారాల్లో విదే శీ ఇన్వెస్టర్ల వైఖరిలో మార్పు వచ్చింది. అంతకు ముందు జూన్ మొదటి రెండు వారాల్లో ఎఫ్‌పిఐలు అమ్మకందారులుగా ఉన్నారు. జూన్ మొదటి రెండు వారాల్లో విదేశీ పోర్ట్ఫోలి యో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) దాదాపు రూ.15 వేల కోట్ల విలువైన షేర్లను విక్రయించారు.
అంతకు ముందు మే నెలలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.25,586 కోట్ల విలువైన భారతీయ షేర్లను సేల్ చేశారు. కాగా ఏప్రిల్‌లో ఎఫ్‌పిఐలు రూ.8,671 కోట్లను ఉపసంహరించుకున్నారు. ఈ విధంగా వరుసగా 2 నెలల అమ్మకాల తర్వాత ఎఫ్‌పిఐలు మళ్లీ భారతీయ షేర్లను కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఎఫ్‌పిఐలు ఈ సంవత్సరం మొదటి నెల జనవరిలో రూ. 25,744 కోట్ల విలువైన భారతీయ షేర్లను విక్రయించారు.
అయితే ఆ తర్వాత రెండు నెలల పాటు కొనుగోలుదారుగానే ఉన్నారు. ఎఫ్‌పిఐలు ఫి బ్రవరి 2024లో రూ.1,539 కోట్లు, మార్చిలో రూ.35,098 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఇటీవలి వారాల్లో కొనుగోళ్ల ద్వారా భారత మార్కెట్లో ఎఫ్‌పిఐలు పెట్టిన మొత్తం పెట్టుబడి ఇప్పుడు రూ. లక్ష కోట్లు దాటింది. ఎన్ఎస్డిఎల్ డేటా ప్రకారం, 2024లో ఎఫ్‌పిఐ మొత్తం పెట్టుబ డి ఇప్పుడు రూ.1,09,934 కోట్లకు చేరుకుంది.
త్వరలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్‌పై స్టాక్ మార్కెట్లో ఉత్కం ఠ నెలకొంది. వివిధ రంగాలు ముఖ్యంగా తయారీ రంగానికి బడ్జెట్లో ప్రభుత్వం భారీ ప్రకటనలు చేయవచ్చని మార్కెట్ ఆశాభావం వ్యక్తం చేసింది. విదేశీ అంశాలు కూడా భారత మార్కెట్‌కు అనుకూలంగా ఉన్నాయి. రానున్న రోజుల్లో దేశీయ మార్కెట్లో ఎఫ్‌పిఐ కొనుగోళ్లు కొనసాగొచ్చు.
More Stories
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి
రద్దైన నోట్లతో శశికళ బినామీ షుగర్ ఫ్యాక్టరీ.. సీబీఐ కేసు