
కేంద్రంలో ఏర్పడిన ఎన్డీయే ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారిన తర్వాత, ముఖ్యమంత్రి హోదాలో మొదటిసారి దేశ రాజధాని ఢిల్లీ పర్యటన జరిపిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివాదాస్పదమైన ప్రత్యేక హోదా అంశాన్ని ప్రస్తావించకుండా, రాజకీయ పరమైన డిమాండ్లను చేయకుండా వ్యూహాత్మకంగా వైసిపి పాలనలో విధ్వంసకు గురైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పధంలో పెట్టేందుకు కేంద్రం నుండి భారీ ఆర్ధిక సాయ కోసం ప్రయత్నం చేసినట్లు తెలుస్తున్నది.
ప్రధాని నరేంద్ర మోదీ ముందుంచిన ప్రతిపాదనల వివరాలను ఆయన మీడియాకు వివరించక పోయినప్పటికీ రూ 1 లక్ష కోట్ల మేరకు ఆర్ధిక ప్యాకేజీని కోరినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. ముఖ్యంగా మరో రెండు వారాలలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ లోనే నిర్దుష్టమైన ప్రతిపాదనలను పొందుపరచాలని కోరినట్లు స్పష్టం అవుతుంది.
ఏపీకి సుమారుగా 12 బిలియన్ డాలర్లు (ఏపీకి లక్ష కోట్లు) ఆర్థిక సహాయాన్ని కోరినట్లు బ్లూమ్ బర్గ్, ఎకనమిక్స్ టైమ్స్ తమ కధానాలలో వెల్లడించాయి.
గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం సహా ఇతర ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు చేయాలని కోరినట్లు సమాచారం.
గురువారం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన చంద్రబాబు అమరావతి రాజధాని నిర్మాణం సహా ఇతర ప్రాజెక్టులకు సహకారం అందించాలని కోరారు. కేంద్రం త్వరలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఈ మేరకు కేటాయింపులు చేయాలని కోరినట్లు సమాచారం.
చంద్రబాబు ప్రతిపాదనల పట్ల మోదీ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. మరోవైపు ప్రధానమంత్రి మోదీతో పాటు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తోనూ చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగానూ చంద్రబాబు ఈ విషయం మీద చర్చించినట్లు సమాచారం. ఆర్థిక లోటును భర్తీ చేయడానికి రూ.7000 కోట్లు, నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.50,000 కోట్లు కేటాయించాలని చంద్రబాబు కోరినట్లు తెలిసింది. ఇందులో మొదటి విడతగా రూ.15 వేల కోట్లను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేటాయించాలని ఏపీ సీఎం కేంద్రాన్ని కోరారు.
అలాగే పోలవరం ప్రాజెక్టుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 12 వేల కోట్లను కేటాయించాలని కోరారు. భవిష్యత్తులోనూ ఈ ప్రాజెక్టుకు మరింత సహకారం అందించాలని చంద్రబాబు కోరినట్లు సమాచారం. అలాగే అప్పులను తీర్చేందుకు వచ్చే ఐదేళ్లలో రూ.15,000 కోట్లు ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. అలాగే కేంద్ర ప్రభుత్వం యాభై సంవత్సరాల రుణ పథకం కింద మౌలిక వసతుల అభివృద్ధికి రూ. 10,000 కోట్లు కేటాయించాలని కేంద్రాన్ని చంద్రబాబు కోరినట్లు సమాచారం.
ఇవే కాకుండా 2025 మార్చి నాటికీ ప్రస్తుతం ఉన్న అప్పు పరిమితిని మరో 0 .5 శాతం మేర పెంచే వెసులుబాటు కలిపించాలని కోరారు. ఈ మొత్తం ఏడు వేల కోట్ల రూపాయలు అవుతుంది అని లెక్కకట్టారు.
More Stories
ప్రముఖ నవలా రచయిత ’లల్లాదేవి’ కన్నుమూత
ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ తిరుపతి
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి