మహిళ ద్రోహి కాంగ్రెస్ ప్రభుత్వం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సంధర్బంగా కాంగ్రస్ పార్టీ మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడం లొ  నేటి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని బీజేపీ రాష్ట్ర మహిళ మోర్చా అధ్యక్షురాలు డా. శిల్పరెడ్డి మండిపడ్డారు .ప్రభుత్వం ఎర్పిడిన వెంటనే మహిళలకు ప్రతి నెల ఇస్తాం అన్న 2500 రూపాయలు ఇంతవరకు మహిళలకు అందిన దాఖలాలు లేవని ఆమె ధ్వజమెత్తారు. 
 
కొత్తగా పెళ్లి చేసుకునే ప్రతి ఆడబిడ్డకి  ఒక లక్ష రూపాయలు నగదు, తులం బంగారం, కాలేజీ కి వెళ్ళే వారికి స్కూటీ వంటివి, ప్రతి విద్యార్థికీ రూ. 5 లక్షలతో కూడిన విద్యార్థి హామీ కార్డు ఇవ్వడం లేదని ఆమె విమరసంచారు. పైగా,   మహిళలకు రూ. 4000 వేల పెన్షన్ బకాయిలతో పాటు చెల్లించాలని ఆమె డిమాండ్ చేసారు. 
 

ఎలాగైనా ప్రభుత్వం ఏర్పాటు చేయాలనీ నోటికి వచ్చిన హామీలన్నీ ఇచ్చి ఈరోజు కి అమలు కాకపోవడాన్ని తెలంగాణా బీజేపీ మహిళా మోర్చ తీవ్రంగా పరిగణిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయంపై ఈ నెల 3, 4 తేదీలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ లను కలిసి వినతి పత్రం సమర్పించాలని డా. శిల్పారెడ్డి తెలంగాణలోని మహిళా మోర్చా శ్రేణులకు పిలుపునిచ్చారు..

వినతిపత్రం ఇచ్చిన వారంలోపు తాము పేర్కొన్న డిమాండ్ లన్ని నెరవేర్చని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా మహిళలందరితో ధర్నాలు చెప్పడతాం అని ఆమె హెచ్చరించారు. ఈ విషయమై ఆమె బుధవారం ఉప్పల ఎంఆర్ఓ ను కలిసి వినతిపత్రం సమర్పించారు.