చంద్రయాన్‌-4 రెండు భాగాలుగా ఇస్రో సరికొత్త ప్రయోగం

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ మరోసారి చరిత్రను సృష్టిచేందుకు సిద్ధమవుతున్నది. ముందెన్నడూ లేనివిధంగా ఇస్రో ఈ సారి కొత్తగా చంద్రయాన్‌-4 మిషన్‌కు సిద్ధమవుతున్నది. 2026 నాటికి ఈ మిషన్‌ మొదలుకానున్నది. మిషన్‌కు సంబంధించిన కీలక వివరాలను ఇస్రో చీఫ్‌ సోమ్‌నాథ్‌ వెల్లడించారు. 

చంద్రయాన్‌-4ని రెండు భాగాలు ప్రయోగించనున్నట్లు తెలిపారు. రెండు భాగాలను ప్రారంభించిన తర్వాత వాటిని అంతరిక్షంలోనే కనెక్ట్‌ చేస్తామన్నారు. ఈ ప్రయోగం విజయవంతమైతే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ నిలువనున్నది. చంద్రయాన్‌-4 ల్యాండర్‌ను ఇస్రో నిర్మిస్తుండగా, రోవర్‌ను జపాన్‌లో సిద్ధం చేస్తున్నది. చంద్రయాన్‌-4 చంద్రుడి శివశక్తి పాయింట్‌ వద్ద ల్యాండ్‌ కానుంది.

మిషన్‌లో ఇక్కడి నుంచే చంద్రుడి ఉపరితలంపై మనట్టిని సేకరించి తిరిగి భూమిపైకి తీసుకురానున్నది. అయితే, తొలిసారిగా అంతరిక్షంలోనే స్పేస్ షటిల్‌ను నిర్మించనున్నట్లు తెలిపారు. అంతరిక్షంలోనే శాటిలైట్‌ నిర్మించడం భారత్‌ చంద్రుడిపై దిగకముందే భారత్‌ చరిత్ర సృష్టిస్తుందని పేర్కొన్నారు. 

చంద్రయాన్-4కు ఈసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. చంద్రుడిపై ఎలాంటి నమూనాలను తీసుకురావాలనేది లక్ష్యమని. ఈ ప్రయత్నంలోనే భాగంగా స్పేస్‌లో డాకింగ్‌ చేయాలని ఇస్రో నిర్ణయించినట్లు తెలిపారు. మిషన్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ఆమోదం కోసం కేంద్రానికి పంపినట్లు ఇస్రో చీఫ్‌ తెలిపారు.

 ఇస్రో విజన్‌ 2024లో చేరిన నాలుగు ప్రాజెక్టుల్లో ఇది ఒకటి అని తెలిపారు. ఇందులో 2035 నాటికి భారత్‌కు సొంత స్పేస్‌స్టేషన్‌ నిర్మించడం, 2040 నాటికి మానవులను చంద్రుడిపైకి పంపే ప్రణాళిక సైతం ఉన్నది.