కేజ్రీవాల్ బెయిల్​పై ఢిల్లీ హైకోర్టు స్టే

కేజ్రీవాల్ బెయిల్​పై ఢిల్లీ హైకోర్టు స్టే
ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ట్రయల్ కోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ దాఖలు చేసిన పిటిషన్‌పై కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కోర్టు నిర్ణయం నేపథ్యంలో అరవింద్ కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైల్లోనే ఉండాల్సి రానున్నది. బెయిల్‌ పిటిషన్‌పై ఇచ్చిన స్టేను ఎత్తివేసేందుకు నిరాకరించింది. 
 
బెయిల్‌పై స్టే కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఈడీ సమర్పించిన ఆధారాలను పరిశీలించడంలో ట్రయల్ కోర్టు విఫలమైందని వ్యాఖ్యానించింది. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం తీసుకునేటప్పుడు జడ్జి సహేతుకంగా ఆలోచించలేదని పేర్కొంది. ట్రయల్‌ కోర్టు ఉత్తర్వు లోపభూయిష్టంగా ఉందని.. కేజ్రీవాల్‌కు బెయిల్‌ ఇవ్వొద్దంటూ ఈడీ కోర్టును కోరింది.
ఈ నెల 20న రౌస్‌ అవెన్యూ కోర్టు సీఎం కేజ్రీవాల్‌కు బెయిల్‌ మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21న కోర్టు నిర్ణయాన్ని ఈడీ ఢిల్లీ హైకోర్టులో సవాల్‌ చేసింది. ఈ అభ్యర్థన మేరకు కోర్టు స్టే విధించింది.  గతవారం వెకేషన్‌ జడ్జి జస్టిస్‌ జూన్‌ శుక్రవాం ఈడీ పిటిషన్‌ను విచారించారు. స్టే దరఖాస్తుపై తీర్పును రిజర్వ్‌ చేస్తూ.. హైకోర్టు ఉత్తర్వులు వెలువడే వరకు ఇంప్లీడ్‌ ఆర్డర్‌పై స్టే ఇచ్చారు. దీంతో మధ్యంతర స్టేను సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. 
 
పిటిషన్‌ను జస్టిస్‌ మనోజ్‌ మిశ్రా నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ విచారణను వాయిదా వేసింది. హైకోర్టు ఆదేశాల ఇచ్చే వరకు వేచి ఉండాలని సూచించింది. రౌస్ అవెన్యూ కోర్టు వెకేషన్ జడ్జి బిందు జారీ చేసిన బెయిల్ ఆర్డర్‌లో ఈడీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేజ్రీవాల్‌పై ఈడీ పక్షపాతంతో వ్యవహరిస్తుందని అభిప్రాయపడ్డారు. నేరం ద్వారా వచ్చిన ఆదాయానికి సంబంధించి ఈడీ ప్రత్యక్ష సాక్షాలను చూపలేదని పేర్కొంది.