
పశ్చిమబెంగాల్‌లోని డార్జిలింగ్ జిల్లాలో రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ సోమవారం సందర్శించారు. అక్కడ సహాయక చర్యల్లో ఉన్న అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఘటనా స్థలం అంతటా తిరిగి పరిశీలించారు. రక్షణ, సహాయ కార్యక్రమాలు పూర్తి అయ్యాయని మంత్రి ధ్రువీకరించారు.
రమాదానికి కారణాలపై రైల్వే భద్రత కమిషనర్ (సిఆర్‌ఎస్) దర్యాప్తు ప్రారంభించినట్లు రైల్వే శాఖ మంత్రి వెల్లడించారు.. ప్రమాదానికి దారి తీసిన పరిస్థితులు పునరావృతం కాకుండా నివారించేందుకు చర్యలు తీసుకోగలమని మంత్రి ఈ సందర్భంగా మీడియా మాట్లాడుతూ అశ్వినీ వైష్ణవ్ చెప్పారు. రెస్క్యూ ఆపరేషన్ ముగిసిందని చెప్పారు. రైళ్ల రాకపోకల కోసం ట్రాక్ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయని తెలిపారు.
ప్రమాదం జరిగిన మార్గం చాలా ప్రధానమైన మార్గమని, దాంతో రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. ప్రతిపక్షాలు ఈ ప్రమాదాన్ని రాజకీయం చేస్తున్నాయని, రాజకీయాలు చేయడానికి ఇది సమయం కాదని చెప్పారు. తక్కిన దేశంతో ఈశాన్య భారతాన్ని అనుసంధానించే ఈ కీలక మార్గంలో రైలు సర్వీసుల పునరుద్ధరణకు రైల్వేలు అగ్ర ప్రాధాన్యం ఇచ్చినట్లు ఆయన ఉద్ఘాటించారు.
సమాచారం తెలిసిన వెంటనే కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఢిల్లీ నుంచి బాగ్డోగ్రా విమానాశ్రయానికి చేరుకుని, అక్కడి నుంచి బైక్‌పై ఘటనా స్థలికి చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించిన వెంటనే నేరుగా క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్న సిలిగురిలోని నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజీకి వెళ్లి బాధితులను పరామర్శించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు.
కాగా ఈ ఉదయం డార్జిలింగ్ జిల్లాలోని న్యూ జల్పాయ్‌గురి దగ్గర ప్రయాణికులతో వెళ్తున్న కాంచన్‌జుంగా ఎక్స్‌ప్రెస్ రైలును ఓ గూడ్స్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 8 కి చేరింది. మరో 25 నుంచి 30 మంది తీవ్ర గాయాలతో సిలిగురిలోని మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతులకు కేంద్రం రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.
More Stories
రామ జన్మభూమిలో తొలి `కరసేవక్’ కామేశ్వర చౌపాల్ మృతి
ప్రయాగ్రాజ్ మహాకుంభ్ నుండి సనాతన- బౌద్ధ ఐక్యత సందేశం
చరిత్ర సృష్టించిన రవీంద్ర జడేజా