పాక్‌ కంటే భారత్‌ వద్దే ఎక్కువ అణ్వస్ర్తాలు

అణ్వాయుధాల్ని పెంచుకోవటంలో భారత్‌, చైనా, పాకిస్థాన్‌ దేశాలు ఒకదానికొకటి పోటీ పడుతున్నాయి. చైనా అండదండలతో మొన్నటి వరకు భారత్ కన్నా ఎక్కువగా అణ్వస్త్రాలను సమకూర్చుకొంటూ వస్తున్న పాకిస్తాన్ ఇప్పుడు వెనుకబడింది.  పాకిస్థాన్‌-170, భారత్‌-172 అణ్వాయుధాల్ని కలిగివున్నాయని, క్రితం ఏడాదితో పోల్చితే 2024 జనవరి నాటికి చైనా అణు వార్‌హెడ్స్‌ 410 నుంచి 500కు పెరిగాయని స్వీడన్‌కు చెందిన మేథో సంస్థ ‘సిప్రి’ (స్టాక్‌హోం ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌) తాజా నివేదిక పేర్కొన్నది. 
 
‘అణ్వాయుధ సేకరణలో భారత్‌ను నిరోధించటమే లక్ష్యంగా పాకిస్థాన్‌ ప్రణాళికలు ఉన్నాయి. సుదీర్ఘ లక్ష్యాల్ని తాకే అణువార్‌ హెడ్లపై భారత్‌ దృష్టిపెట్టింది. ముఖ్యంగా చైనా అంతటా లక్ష్యాల్ని చేరుకోగలగటం ప్రాధాన్యతగా ఉంది’ అని నివేదిక తెలిపింది.  ఇప్పటికే అత్యంత బలోపేతంగా ఉన్న చైనా పోటీని, మరో వైపు అణ్వాయుధ బలంలో తమతో సాటిగా వస్తూ ఉన్న పాకిస్థాన్‌ను ఎ్పటికప్పుడు గమనిస్తూ తన బలం పెంచుకోవల్సి వస్తోంది.
 
భారత్‌, పాక్‌, చైనా, అమెరికా, రష్యా, బ్రిటన్‌, ఫ్రాన్స్‌, ఉత్తర కొరియా, ఇజ్రాయెల్‌ దేశాల అణు వార్‌హెడ్లకు సంబంధించి కీలక విషయాల్ని నివేదికలో పేర్కొన్నది. దీని ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 2,100 అణ్వాయుధాలు ఉన్నాయి. దీంట్లో 90 శాతం అమెరికా, రష్యా కలిగి ఉన్నాయి.

చైనా కూడా తన అణ్వాయుధాలను ఎప్పుడంటే అప్పుడు రంగంలోకి దించడానికి సిద్దం చేసుకుంది. ఈ ఏడాది జనవరి నాటికి లెక్కలు చూసుకుంటే దాదాపుగా 12, 121 వరకూ అణ్వాస్త్రాలు తయారు అయి ఉన్నాయి. వీటిలో దాదాపు 10వేల వరకూ సైనిక గిడ్డంగులలో వాడకానికి సిద్దంగా ఉన్నాయని వెల్లడించారు. వీటిలో అనేకం మిస్సైల్స్, విమానాలకు అనుసంధానం అయి ఉన్నాయి. 

ఈ దేశాలు 2023లో తమ అణ్వాయుధాలను మరింతగా ఆధునీకరించుకోవడంతో పాటు , తమ దేశ రక్షణ ధర్మంలో భాగంగా అత్యంత అధునాత అణ్వాయుధ వ్య వస్థలను సంతరించుకున్నాయని ఈ నివేదిక తెలిపింది.  ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో అనిశ్చితులు పెరుగుతున్నాయి. ఒకవైపు చల్లారని రీతిలో ఉన్న సంఘర్షణలు ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయి యుద్ధాలకు దారితీస్తున్న దశలోనే పోటాపోటీగా పలు దేశాలు అణ్వాయుధ పాటవం సంతరించుకోవడం, ఆ త్మరక్షణ పేరిట ఈ శక్తిని ఇనుమడింపచేసుకోవడం కీలక అంశమైంది.
 
రష్యా- ఉక్రెయిన్​ యుద్ధం, ఇజ్రాయెల్​- పాలస్తీనా యుద్ధం వంటివి ఆందోళనకు గురిచేస్తున్నాయి. అటు ఉత్తర కొరియా నిత్యం క్షిపణీ పరీక్షలతో ప్రపంచాన్ని బెంబెలెత్తిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఘర్షణలు, యుద్ధం మాట వచ్చినా.. అణ్వాయుధాల వినియోగం పట్ల సర్వత్రా ఆందోళనలు వ్యక్తమవుతుంటాయి. దేశాలన్నీ అణ్వాయుధాలను అడ్డంపెట్టుకుని బెదిరిస్తూ ఉంటాయి. ఇవి సర్వత్రా భయాందోళనలను సృష్టిస్తూ ఉంటాయి.

సిప్రీ నివేదికలోని ప్రధాన వివరాలు

  1. ఈ ఏడాది జనవరిలో భారతదేశం నిల్వ చేసిన అన్వయుధాలు172. పాకిస్థాన్​లో ఈ సంఖ్య 170.
  2. 2023లో భారత్ తన అణ్వాయుధాలను కొద్దిగా విస్తరించగా, 2023లో భారత్, పాకిస్థాన్లు కొత్త తరహా న్యూక్లియర్ డెలివరీ వ్యవస్థలను అభివృద్ధి చేస్తూనే ఉన్నాయి.
  3.  భారత అణ్వస్త్ర ప్రోగ్రామ్​లో పాకిస్థానే టార్గెట్​గా ఉంటోంది. కానీ ఇటీవలి కాలంలో ఇండియా అణ్వాయుధా టార్గెట్స్​లో మార్పులు కనిపిస్తున్నాయి. చైనాను కూడా చేరుకోగలిగే విధంగా లాంగ్​ రేంజ్​ వెపన్స్​ని రెడీ చేస్తోంది భారత్.
  4. ప్రపంచవ్యాప్తంగా మోహరించిన వార్​హెడ్​లలో దాదాపు 2,100 బాలిస్టిక్ క్షిపణులను హై ఆపరేషనల్ అలర్ట్​లో ఉన్నాయి. వాటిలో దాదాపు అన్నీ రష్యా లేదా అమెరికాకు చెందినవే. అయితే, తొలిసారిగా చైనా వద్ద కొన్ని వార్ హెడ్​లు హై ఆపరేషనల్​ అలర్ట్​లో ఉన్నట్లు తెలుస్తోంది.
  5. మొత్తం అణ్వాయుధాల్లో దాదాపు 90 శాతం రష్యా, అమెరికాల వద్దే ఉన్నాయి.
  6. 2023 జనవరితో పోలిస్తే రష్యా 36 అదనపు వార్ హెడ్​లను మోహరించినట్లు నిఘా సంస్థ తెలిపింది.
  7. రష్యా లేదా అమెరికా నిల్వల కంటే చైనా వద్ద అణ్వాయుధాల నిల్వలు చాలా తక్కువగా ఉంటాయని నివేదిక తెలిపింది.