హైదరాబాద్ గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను పోలీసులు అరెస్టు చేసారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. మెదక్ అల్లర్లను దృష్టిలో పెట్టుకొని పరిస్థితి అదుపుతప్పకుండా ఉండేందుకు రాజాసింగ్‌ను ముందస్తుగా అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకొని మియాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అల్లర్లలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు.
ముంబై నుంచి హైదరాబాద్ రాగానే ఎయిర్‌పోర్టులోనే అదుపులోకి తీసుకొని మియాపూర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అల్లర్లలో గాయపడిన వారిని ఆయన పరామర్శించారు. బక్రీద్ సందర్భంగా ఆవులను తరలిస్తున్న వాహనాలను మెదక్ పట్టణంలో అడ్డుకున్నారు. దీంతో పట్టణంలో అల్లర్లు చెలరేగాయి.
ఇందులో ఓ వర్గానికి చెందిన వారు బీజేవైఎం, హిందూ సంఘాల నేతలపై కత్తితో దాడి చేశారు.
ఓ యువకుడు తీవ్రంగా గాయపడి ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో ఆగ్రహించిన నేతలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు రంగంలోకి దిగి అల్లర్లను సద్దుమణిగేలా చేశారు. మెదక్ పట్టణంలో జరిగిన హింసాకాండకు సంబంధించి బీజేపీ మెదక్ జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, బీజేపీ మెదక్ పట్టణ అధ్యక్షుడు ఎం నయం ప్రసాద్, బీజేవైఎం అధ్యక్షుడు, మరో ఏడుగురిని కూడా తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా రాష్ట్రంతో గోవధ నిషేధం కొనసాగుతున్నప్పటికీ అక్రమంగా గోవులను తరలించే వారికి అడ్డుకుంటే దాడులు చేస్తారా? అంటూ రాజా సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో ఉన్న రాజాసింగ్ ఆదివారం మెదక్ పట్టణానికి వస్తానని చెప్పారు. అల్లరి మూకల దాడిలో గాయపడిన వారిని పరామర్శించడానికి తాను వస్తానని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. దానితో రాజాసింగ్ అక్కడకు వెళితే అల్లర్లు చెలరేగే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఆయనను ముందస్తుగా ఎయిర్ పోర్టులోనే అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు.
ఆవులను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై మెదక్ లో శనివారం రెండు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో, మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తా సమీపంలో పోలీసులు 144 సెక్షన్ విధించారని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని మెదక్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం బి బాల స్వామి తెలిపారు.
ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నామని, ఇరువర్గాలపై కేసులు నమోదు చేస్తున్నందున దర్యాప్తు కొనసాగుతోందని, ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ఆయన ప్రకారం, భారతీయ జనతా యువమోర్చా నాయకులు ఆవుల రవాణాను ఆపడంతో గొడవ చెలరేగింది. ఫిర్యాదు ఇవ్వడానికి బదులుగా వారు నిరసనకు దిగారు. “ఈ ఘర్షణలతో ఇద్దరు వ్యక్తులకు గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాలు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆసుపత్రిపై కూడా దాడి జరిగింది” అని స్వామి తెలిపారు.

More Stories
తెలంగాణలో నడుస్తున్నది రేవంతుద్దీన్ సర్కారు
ఆర్ఎస్ఎస్- వామపక్షాలు: ఒకటి అభివృద్ధి? మరొకటి నశించింది?
ఏఐతో డీప్‌ఫేక్, కృత్రిమ కంటెంట్ లపై కేంద్రం కొరడా