బక్రీద్ పేరుతో విచ్చలవిడిగా గోవధ

మెదక్ పట్టణంలో దోషులను వదిలేసి బాధితులను రిమాండ్ చేయడం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని, గోరక్ష విషయంలో పోలీసుల పక్షపాతి ధోరణి ఏ మాత్రం సరికాదని విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ విమర్శించారు.  గోహత్య నిషేధ చట్టాలు కఠినంగా అమలు చేయాల్సిన అధికారులే గోహంతకులను ప్రేమిస్తుంటే న్యాయం ఒప్పుకోదని స్పష్టం చేశారు. 
 
 గోవులను కాపాడేందుకు వెళ్లిన గో ప్రేమికులపై ముస్లిం మూకలు కత్తులు, పదునైన ఆయుధాలతో విచక్షణారహితంగా దాడి చేసి హత్యాయత్నం చేసినప్పటికీ పోలీసులు చర్యలు తీసుకోకపోవడం దుర్మార్గం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువుల పరమ పవిత్రమైన గోవులను రక్షించేందుకు తాము శాంతియుతంగా అనేక పద్ధతులతో నిరసన కార్యక్రమాలు తెలియజేస్తూనే ఉన్నామని తెలిపారు. 
 
ఈనెల 3న ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం ఇచ్చినట్లు పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి  పండరీనాథ్, రాష్ట్ర ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివరాములు తెలిపారు. ఆ తరువాత ఈనెల 7న ఇందిరాపార్క్ దగ్గర ధర్నా కూడా చేశామని, గోరక్షణ విషయంలో కఠినమైన చట్టాలు అమలు చేసి గోవులను కాపాడాలని డిమాండ్ చేసినట్లు వివరించారు. 
 
కానీ పోలీసులు అవేవీ ఖాతరు చేయడం లేదనీ, ప్రభుత్వం పట్టించుకోనే లేదనీ, కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రధాని వస్తున్నట్లు ఆరోపించారు. పట్టుకున్న గోవులను కూడా వదిలేసి వధించేందుకు వీలుగా చర్యలు చేపడుతున్నారని వారు మండిపడ్డారు. ముఖ్యంగా మదర్సాలు, మసీదులు, సమస్యత్మక ప్రాంతాలలో గోవులను మేకలను కట్టేసిన తీరుగా ఇళ్ళ ముందు కట్టేసుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 
 
కానీ పోలీసులు వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడం లేదని, ఇకనైనా ఈరోజు స్పందించి ఎక్కడైతే సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయో అక్కడ పోలీసులు చొరవ తీసుకొని ఆవులను విడిపించాలని డిమాండ్ చేశారు.  ముఖ్యంగా మెదక్ నగరంలో ఎవరైతే కత్తులతో స్వైరవిహారం చేసి గో ప్రేమికులపై హత్యాయత్నం చేశారో వాళ్ళను వెంటనే అరెస్టు చేయాలని  డిమాండ్ చేశారు. 
 
మెదక్ సంఘటన విషయమై తెలంగాణ డిజిపి రవి గుప్తో మాట్లాడితే.. ఐజి రంగనాథ్ చూస్తున్నారని చెప్పారని, కనై రాత్రి నుంచి ఐజి, మెదక్ ఎస్పీలకు  ఎన్నిసార్లు ఫోన్లు చేసినా స్పందించడం లేదని విమర్శించారు.  పోలీసులు ఏర్పాటుచేసిన చెక్ పోస్టులు పేరుకు మాత్రమే ఉన్నాయి, కానీ అక్రమంగా చట్ట విరుద్ధంగా తరలిపోతున్న గోవులను పట్టుకున్న దాఖలాలు లేవు అనే విషయం స్పష్టం చేసుకోవాలనీ ఆవేదన వ్యక్తం చేశారు.