చంద్రబాబును ప్రసన్నం చేసుకొనేందుకై అధికారుల పాట్లు!

 గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వంలో చెలరేగిపోయిన సీనియర్ అధికారులు ఆ పార్టీ ఓటమి పాలవగానే చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు తంటాలు పడుతున్నారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన అధికారుల్లో చాలామంది 2019 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే వైసీపీ ముఖ్యనాయకుల్ని ప్రసన్నం చేసుకొని కేకల పదవులు పొందారు. ఫలితాలు వెలువడిన వెంటనే పూర్తిగా చంద్రబాబు వ్యతిరేక వైఖరి ప్రదర్శించారు.
తాజా ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించడంతో గత కొద్ది రోజులుగా వారంతా చంద్రబాబును కలిసేందుకు విఫల యత్నం చేస్తున్నారు. ఆయన ఇంటికి వెళ్లి కలిసే ప్రయత్నం ప్రయత్నం ఫలించక పోవడంతో గురువారం ఆయన సచివాలయంకు వచ్చిన్నప్పుడు విడిగా కలిసేందుకు ప్రయత్నించినా అందుకు ఆయన ఒప్పుకోలేదు.
 
సీఎంను కలిసేందుకు వచ్చిన ఐఏఎస్‌లు శ్రీలక్షీ, పూనమ్ మాలకొండయ్య, అజయ్ జైన్, ప్రవీణ్ ప్రకాష్, ఐపీఎస్‌లు సునీల్ కుమార్, పీఎస్ఆర్ ఆంజనేయులును కలిసేందుకు ప్రత్యేకంగా అనుమతి దక్కలేదు. వీరిలో పూనమ్ మాలకొండయ్య, ప్రవీణ్‌ ప్రకాష్, అజయ్‌ జైన్ వంటి అధికారులు చంద్రబాబు వద్ద గతంలో కీలక శాఖల్ని నిర్వహించారు.
సచివాలయంలో బాధ్యతల స్వీకారం తర్వాత శాఖాధిపతులతో జరిగిన భేటీలో క్లుప్తంగా ప్రసంగించిన ఆయన అటువంటి అధికారులను సున్నితంగా మందలించారు.  గత ఐదేళ్లలో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని, రాబోయే ఐదేళ్లలో గాడిలో పెడతానని చెప్పారు. అప్పట్లో అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరించే వారని, కానీ గత ప్రభుత్వంలో కొందరు అధికారులు వ్యవహరించిన తీరుపై విస్మయం వ్యక్తం చేశారు. 
 
రెండు, మూడు రోజుల తర్వాత మరోసారి కలుద్దామని సూచించారు. “1995లో నేను మొదటి సారి సీఎం అయ్యాను. నాడు నాతో పని చేసిన వారిలో కొందరు నేడు ఇక్కడ ఉండి ఉంటారు. నాలుగో సారి ఇప్పుడు సీఎంగా బాధ్యతలు తీసుకున్నాను. రాష్ట్రంలో నేడు చూసిన దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అనేవి అత్యంత గౌరవప్రదమైన ఉద్యోగాలు. ఇక్కడున్న కొందరు అధికారులు గతంలో ఆదర్శవంతంగా పని చేశారు” అని తెలిపారు. 
 
కానీ గత ఐదేళ్లలో మాత్రం ఏం చేశారో మీరే ఆత్మవిమర్శ చేసుకోవాలని ఆయన కోరారు. పరిపాలన ఇంత అన్యాయంగా తయారవుతుందని తాను ఎప్పుడూ ఊహించలేద