వైద్య విద్య ప్రవేశాల కోసం నిర్వహించే నేషనల్ ఎంట్రెన్స్ కమ్ ఎలిజిబిలిటీ టెస్ట్ అండర్ గ్రాడ్యయేట్ (నీట్ యూజి) పరీక్షను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది. జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ అమానుల్లాహ్ తో కూడిన వెకేషన్ బెంచ్ విచారణ చేపట్టింది.
మే 5న జరిగిన నీట్ యూజి పరీక్ష పేపర్ లీకేజ్ ఆరోపణల నేపథ్యంలో పరీక్షను రద్దు చేయాలని పిటిషనర్లు కోరుతున్నారని, దీనిపై సమాధానం చెప్పాలంటూ కేంద్ర ప్రభుత్వానికి, ఎంట్రెన్స్ పరీక్ష నిర్వహించిన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్ టిఏ)కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. కాగా నీట్ పరీక్షను రద్దు చేయడం అంత సులభం కాదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
‘‘ఆరోపణలపై మాకు సమాధానాలు కావాలి. ఎప్పటిలోగా సమాధానం చెబుతారు? కాలేజీలు తెరుచుకున్న వెంటనే చెబుతారా? లేకుంటే ఎంబిబిఎస్ కౌన్సలింగ్ మొదలవుతుంది’’ అని ఎన్ టిఏ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి న్యాయమూర్తి అమానుల్లాహ్ పేర్కొన్నారు. స్పందన తెలుపాలంటూ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి నోటీసలు జారీ చేశారు.
కౌన్సిలింగ్‌ను ఆపడం లేదని, కానీ ఈ కేసును జూలై 8వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం చెప్పింది. ఒకే కోచింగ్ సెంటర్‌కు చెందిన 67 మంది విద్యార్థులకు సరిగ్గా ప్రతి ఒకరికి 720 మార్కులు వచ్చాయని , అందుకే పరీక్షను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
More Stories
బస్తర్ ప్రాంతంలో 12 మంది నక్సల్స్ హతం!
ఓఎంఆర్ పద్ధతిలో నీట్ యూజీ 2025 పరీక్ష
శ్రీహరికోటలో మూడవ లాంచ్ప్యాడ్