
ఏపీలో మద్యం ధరల్ని పెంచడం, ఊరు పేరు లేని నాసిరకం మద్యం బ్రాండ్లను విక్రయించడంలో వేల కోట్ల రుపాయల అక్రమాలు జరిగాయని ఐదేళ్లుగా విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఏపీలో మద్యం పాలసీ పేరుతో మద్యం ధరల్ని గణనీయంగా పెంచేసి, తమకు అనుకూలంగా ఉన్న బ్రాండ్లను మాత్రమే ఐదేళ్లుగా విక్రయించడం ద్వారా ప్రభుత్వం వేల కోట్ల అక్రమాలకు పాల్పడిందని బీజేపీ పలుమార్లు ఫిర్యాదు చేసింది.
బేవరేజెస్ కార్పొరేషన్ ఆదాయాన్ని చూపించి వేల కోట్ల రుణాలను తీసుకున్నారని, ఆర్ధిక అవకతవకలు పెద్ద ఎత్తున జరిగాయని ఎన్నికలకు ముందు పలుమార్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు డి పురందేశ్వరి కేంద్రానికి ఫిర్యాదు చేశారు. బేవరేజెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసి వాటిలో ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే డిస్టిలరీల్లో తయారైన నాసిరకం మద్యాన్ని విక్రయించారని, బాట్లింగ్ ధరకు, విక్రయ ధరకు భారీ వ్యత్యాసం ద్వారా వేల కోట్లు పక్కదారి పట్టాయని విపక్షాలు ఆరోపించాయి.
రాజకీయ పార్టీల ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల కోడ్ వెలువడిన వెంటనే ఆయనపై వేటు పడింది. ఎన్నికలకు ముందే తన మాతృ సంస్థకు వెళ‌్ళిపోయేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై దృష్టి పెట్టింది.
More Stories
శ్రీశైలం అభివృద్ధికి ప్రధానిని రూ. 1,657 కోట్లు కోరనున్న దేవస్థానం
పరకామణిలో చోరీకి పాల్పడిన రవికుమార్ అదృశ్యం!
`త్రిశూల’ వ్యూహంతో జనసేన బలోపేతంపై పవన్ దృష్టి