ఆంధ్ర ప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి సునామీ సృష్టించింది. 164కి స్థానాలతో ప్రభంజనం సృష్టించింది. `వైనాట్ 175′ అంటూ విర్రవీగిన వైఎస్సార్సీపీకి అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేకుండా గల్లంతు చేశారు. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కనీవినీ ఎరుగని ఏకపక్ష విజయం నమోదైంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తిరుగులేని విజయంతో చరిత్ర సృష్టించింది.
వైనాట్ 175 అంటూ తలెగరేసిన వైఎస్సార్సీపీను సకలజనులూ నేలకేసికొట్టారు. 175 అసెంబ్లీ స్థానాలకుగాను కూటమి ఒక్కటే 164 స్థానాలు కైవసం చేసుకుంది. తెలుగుదేశం ఒక్కటే సొంతంగా 135 స్థానాలు గెలుచుకుని అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. జనసేన పోటీచేసిన 21 సీట్లలోనూ సత్తాచాటింది. పోటీచేసిన అన్ని స్థానాల్లో, జయభేరి మోగించిన పార్టీగా రికార్డ్ సృష్టించింది.
వందశాతం స్ట్రైక్ రేట్‌తో, శాససనభలో రెండో పెద్ద పార్టీగా జనసేన అవతరించింది. పది స్థానాల్లో పోటీచేసిన బీజేపీ కూడా కూటమి పార్టీల మద్దతుతో అనూహ్యంగా 8 అసెంబ్లీ స్థానాలు ఖాతాలో వేసుకుంది. ఏపీ అసెంబ్లీలో బీజేపీ ఇన్ని అసెంబ్లీ స్థానాలు గెలవడం ఇదే తొలిసారి.
ఇక అధికార వైఎస్సార్సీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ఘోర ఓటమిని మూగట్టుకుంది. ప్రతిపక్ష హోదాకు కావాల్సిన 18 స్థానాలు కూడా గెలుచుకోలేక చతికలపడింది. మొత్తం 8 ఉమ్మడి జిల్లాల్లో..వైఎస్సార్సీపీ కనీసం ఖాతా తెరవలేకపోయింది. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం, ఉమ్మడి గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు, అనంతపురం జిల్లాలను స్వీప్ చేసిన కూటమి వైఎస్సార్సీపీను చావుదెబ్బ కొట్టింది.
జగన్ సొంత జిల్లా కడపలో మాత్రమే మూడు స్థానాలు దక్కించుకుని వైఎస్సార్సీపీ కాస్త పరువు నిలుపుకోగలిగింది. పులివెందులలో జగన్ గెలిచినా, మెజార్టీ పడిపోయింది. 61 వేల 176 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన జగన్.. 2019 ఎన్నికలతో పోల్చితే 28 వేల ఓట్ల మెజారిటీ కోల్పోయారు. ప్రధానంగా వైఎస్సార్సీపీ తన కంచుకోటగా చెప్పుకున్న రాయలసీమ ప్రజలు కూడా జగన్ పార్టీ అభ్యర్థులను చీమల్లా నలిపేశారు. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ స్థానాలుండగా, కూటమి ఏకంగా 45 స్థానాలు కొల్లగొట్టింది. వైఎస్సార్సీపీ 7 స్థానాలతో సరిపెట్టుకుంది.
అమరావతిని ఆగమాగం చేసిన జగన్‌ను రాజధాని ప్రాంత ఓటర్లు జీరో చేసేశారు. రాజధాని ప్రాంతంలోని 33కు 33 సీట్లనూ కూటమే గెలుచుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోనూ జగన్ ముఠా ఖాతా తెరవలేదు. 34కి 34 స్థానాలూ కూటమే కొల్లగొట్టింది.! కార్యనిర్వాహక రాజధానిముసుగు వేసుకొచ్చిన జగన్‌ను.. ఉత్తరాంధ్ర ఈడ్చికొట్టింది. ఉత్తరాంధ్రలో 34 స్థానాలకు 32 కూటమి పార్టీలు గెలుచుకోగా, వైఎస్సార్సీపీ కేవలం రెండింటితో సరిపెట్టుకుంది. జగన్‌కుకోస్తాంధ్ర ప్రాంతంలో ఒకే ఒక్క సీటు దక్కింది. కోస్తాంధ్రలో 22 సీట్లకు కూటమి 21 దక్కించుకుంది.
కౌంటిగ్ ప్రారంభం నుంచే కూటమి ప్రభంజనం స్పష్టమైంది. ఏ దశలోనూ ఆ పార్టీ అభ్యర్థులు వెనుదిరిగి చూసుకోలేదు. రౌండ్ రౌండ్‌లో ఆధిక్యం పెంచుకుంటూ విజయతీరాలకు చేరుకున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా జగన్ మంత్రివర్గ సహచరులంతా మట్టికరిచారు. బొత్స, ధర్మాన వంటి సీనియర్ నేతలనూ ఓటర్లు ఇంటికి పంపారు.
సామాజిక న్యాయం ముసుగులో జగన్ ఐదుగురు ఉపముఖ్యమంత్రులను జనంలోకి పంపినా ఎన్నికల బరిలో ఒక్కరూ కనీస పోటీ ఇవ్వలేక ఇంటికి పోయారు. శాఖలను పట్టించుకోకుండా, ప్రతిపక్షాలపై నోరుపారేసుకోవడమే పనిగా పెట్టుకున్న మంత్రుల జతకాలనూ ఓటర్ల మడతపెట్టేశారు.
More Stories
అన్న క్యాంటీన్లు ప్రయోజనమే… నిర్వహణకు ఓ కార్పొరేషన్ ఉండాలి!
జిహెచ్ఎంసి మేయర్ విజయలక్ష్మిపై అవిశ్వాసం?
ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రమాణంలో ప్రత్యేక ఆకర్షణగా ఉష