
60 సీట్లున్న అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీకి 2024 ఏప్రిల్ 19న ఎన్నికలు జరిగాయి. మెజారిటీ మార్క్ 31గా ఉంది. మొత్తం 60 స్థానాల్లో 46 సీట్లలో విజయం సాధించి మ్యాజిక్ ఫిగర్ దాటింది. దీంతో అరుణాచల్ ప్రదేశ్‌లో బీజేపీ వరుసగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. కాగా ముఖ్యమంత్రి ప్రేమ ఖండూ సహా 10 మంది బీజేపీ అభ్యర్థులు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు. మిగిలిన 50 స్థానాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఆదివారం ఉదయం మొదలైంది.
నేనషల్ పీపుల్స్ పార్టీ(ఎన్పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. అరుణాచల్ ప్రదేశ్‌లో ఎన్నికల ఫలితాలు జూన్ 4నే వెలువడనున్నట్లు ఎన్నికల సంఘం తొలుత ప్రకటించింది. కానీ ఆదివారంతో రాష్ట్ర అసెంబ్లీ కాలపరిమితి ముగుస్తుండటం వల్ల కౌంటింగ్‌ను రెండు రోజుల ముందు ఏర్పాటు చేసింది.
2019 అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 41 సీట్లు వచ్చాయి. జేడీయూకి 7 సీట్లు, ఎన్పీపీకి ఐదు సీట్లు దక్కాయి. కాంగ్రెస్ నాలుగు చోట్ల గెలిచింది.
2024 సిక్కిం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార ఎస్కేఎం (సిక్కిం క్రాంతికారి మోర్చా) భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. 32 అసెంబ్లీ సీట్లకు ఆదివారం ఉదయం 6 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవ్వగ మొదటి నుంచి ఎస్కేఎం దూసుకెళుతోంది. మొత్తం 31 సీట్లను గెలుచుకుంది. ప్రధాన ప్రత్యర్థి ఎస్డీఎఫ్ (సిక్కిం డెమొక్రటిక్ ఫ్రెంట్) 1 సీటుకు పరిమితమైంది.
సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ థమన్ (ఎస్కేఎం) రెహాన్ నియోజకవర్గం నుండి గెలుపొందారు. మాజీ ముఖ్యమంత్రి పవన్ ఛాంలింగ్ రెండు చోట్ల నుండి పోటీచేసి ఓటమి చెందారు. 2019లో సిక్కింలో ఎస్కేఎం 17 స్థానాల్లో గెలిచింది. ఎస్డీఎఫ్ 15 చోట్ల విజయం సాధించింది.
More Stories
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు
ఇది ప్రతి భారతీయుడి విజయం
నేపాల్ సుస్థిరత భారత్‌కు ఎంతో కీలకం