 
                ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లాలో బుధవారం భద్రతాబలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు చోటుచేసుకున్నాయి. మాడేడ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. కూంబింగ్ నిర్వహిస్తున్న బలగాలకు మావోయిస్టులు తారసపడటంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుంది. ఘటనా ప్రాంతంలో భద్రతా సిబ్బంది ఇద్దరు మావోయిస్టుల మృతదేహాలను, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.  
ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.  కాగా, తాజాగా మరణించిన ఇద్దరితో కలిపి ఛత్తీస్‌గఢ్‌లో ఇప్పటివరకు ఎన్కౌంటర్లలో మృతిచెందిన మావోయిస్టుల సంఖ్య 118కి చేరింది. మే 23న నారాయణ్‌పూర్-బీజాపూర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో కూడా ఏడుగురు మావోయిస్టులు మృతిచెందారు.
మే 10న బీజాపూర్ జిల్లాలో చోటుచేసుకున్న భారీ ఎన్కౌంటర్లో 10 మంది మావోయిస్టులు మరణించారు. అంతకుముందు ఏప్రిల్ 30న నారాయణ్‌పూర్-కాంకేర్ జిల్లాల సరిహద్దులో జరిగిన ఎన్కౌంటర్లో 10 మంది నక్సలైట్లు మృతిచెందారు. ఏప్రిల్ 16న కాంకేర్ జిల్లాలో జరిగిన భారీ ఎన్కౌంటర్లో ఏకంగా 29 మంది మావోయిస్టులు మరణించారు.





More Stories
2,790 మంది భారతీయులను వెనక్కి పంపిన అమెరికా
కాంకేర్ జిల్లాలో మరో 21 మంది మావోయిస్టుల లొంగుబాటు
దేశవ్యాప్తంగా 22 నకిలీ యూనివర్సిటీలు