
సీతాదేవి భర్త నాగేంద్రనాథ్ ఏపీ రైతాంగ సమాఖ్య, కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టా డ్రైనేజీ బోర్డు సభ్యుడిగా, కొల్లేరు పరిరక్షణ కమిటీ అధ్యక్షుడిగా పనిచేశారు. నాగేంద్రనాథ్ ఏడాది క్రితం మరణించారు. సీతాదేవి, నాగేంద్రనాథ్ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నారు. నాగేంద్రనాథ్ సోదరుడు దివంగత యెర్నేని రాజారామచందర్ కూడా రాజకీయ నేపథ్యం ఉన్నవారే. ఆయన కూడా కైకలూరి నుంచి రెండుసార్లు ఎమ్యెల్యేగా గెలిచారు.
సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు. సీతాదేవి మృతిపట్ల టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు తదితరులు సంతాపం తెలిపారు. రేపు ఆమె స్వస్థలంలో అంత్యక్రియలు జరగనున్నట్లు తెలుస్తుంది.
‘1985,1994లలో ముదినేపల్లి శాసనసభ్యురాలిగా, 1988 లో నందమూరి తారకరామారావు కేబినెట్ లో విద్యాశాఖా మంత్రిగా పనిచేసిన నిగర్వి, స్నేహశీలి అయిన యెర్నేని సీతాదేవికి నా నివాళులు’ అని పురంధేశ్వరి ట్వీట్ చేశారు. సీతాదేవి మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలిపారు.
More Stories
జీఎస్టీ 2.0 సంస్కరణలు స్వాగతించిన ఏపీ అసెంబ్లీ
ప్రభుత్వ రంగం ప్రభుత్వం చేతిలో ఉండకూడదు
జీఎస్టీ సంస్కరణలు ఆత్మనిర్భర్ భారత్కు పెద్ద ఊతం