ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చేందుకు ఓ విద్యార్థిని రెండు సంవత్సరాల క్రితం అమెరికా వెళ్లింది. అనుకున్నట్లే ఎమ్మెస్ పూర్తి చేసి సర్టిఫికెట్ సంపాదించుకుంది. ఇక ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులకు ఆసరాగా ఉందామనుకొనే లోపు విషాదం చోటు చేసుకుంది. అమెరికాలో ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఆ విద్యార్థిని ఓ రోడ్ ప్రమాదంలో మృతి చెందింది. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తన కుమార్తె మృతదేహాన్ని త్వరగా తమ వద్దకు పంపించాలని అధికారులను వేడుకుంటున్న తీరు చూసి స్థానికులను కంటతడి పెట్టిస్తోంది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరి గుట్ట పట్టణం యాదగిరి పల్లికి చెందిన గుడ్ల కోటేశ్వర్ రావు కుమార్తె సౌమ్య (25) రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెస్ చేసేందుకు అమెరికా వెళ్లింది. ఎమ్మెస్ పూర్తి చేసుకుని ఇటీవలే భారతదేశానికి వచ్చి కుటుంబ సభ్యులతో కొన్ని గడిపి మళ్లీ విద్యార్థి వీసా మీద అమెరికాకు వెళ్లింది.

More Stories
కేటీఆర్ ప్రాసిక్యూషన్కు గవర్నర్ అనుమతి
డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ల దోపిడీకి వ్యతిరేకంగా మహా ధర్నా
మావోయిస్టులు అర్బన్ నక్సల్స్ మాటలు నమ్మవద్దు!