పేరొందిన హోటళ్లలో నాణ్యతలేని ఆహార పదార్థాలు

తెలంగాణలోని ప్రముఖ హోటళ్లలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు వరుసగా దాడలు చేస్తున్నారు. పేరుకు పెద్ద హోటళ్లు అయినా ఫుడ్ సేప్టీపై నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్ట్లు తనిఖీల్లో అధికారులు గుర్తించారు. పెద్ద హోటళ్లు అంటే క్వాలిటీ ఫుడ్ అందిస్తారని భ్రమలను అధికారులు తొలగిస్తున్నారు. 
 
హైదరాబాద్ లోని మాదాపూర్ రామేశ్వరం కేఫ్, బాహుబలి కిచెన్ లో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో కాలం చెల్లిన నిల్వ ఉంచిన నిత్యావసర సరుకులు భారీగా గుర్తించారు. కాలం చెల్లిన పదార్థాలను నిల్వ ఉంచి వాటితో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు అధికారులు తనిఖీల్లో గుర్తించారు.
 
కృతుంగ, కేఎఫ్సీ, రామేశ్వరం కేఫ్వంటి బడా హోటళ్లలో అపరిశుభ్ర వాతావరణాన్ని సేఫ్టీ అధికారులు గుర్తించారు. మార్చి 24న జరిగిన దాడుల్లో రామేశ్వరం కేఫ్ లో ఎక్స్ ఫైరీ డేట్ అయిపోయిన 100 కిలోల పప్పు, 10 కిలోల పెరుగు, 8 లీటర్ల పాలును గుర్తించి, అక్కడికక్కడే వాటిని చెత్త డబ్బాల్లో వేయించారు. సరైన లేబుల్ లేని ముడి బియ్యం, తెల్ల లోబియాను అధికారులు సీజ్ చేసుకున్నారు. 
 
అలాగే హోటల్ సిబ్బందికి మెడికల్ ఫిట్ నెస్ సర్టిఫికెట్లు లేకపోవడం, అపరిశుభ్ర కిచెన్లు, డస్ట్‌బిన్‌లకు మూతలు సరిగా లేకపోవడం, తనిఖీల్లో గుర్తించారు. బాహుబలి కిచెన్‌లోని కిచెన్ లో బొద్దింకలను గుర్తించారు. స్టోర్‌రూమ్‌లోని ఆహార పదార్థాలపై సైతం బొద్దింకలు గుర్తించారు.  బంజారాహిల్స్‌లోని లాబొనెల్ ఫైన్ బేకింగ్‌లో కూడా టాస్క్‌ఫోర్స్ అధికారులు తనిఖీలు చేశారు.
వీరి వద్ద దాదాపుగా రూ.4 వేల విలువైన కాలం చెల్లిన వస్తువులను గుర్తించి పాడేశాడు. నిబంధనలు పాటించని ఈ హోటళ్లపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.  నగరంలో బార్‌ అండ్‌ రెస్టారెంట్స్‌, సిట్టింగ్‌ వైన్స్‌లో కిచెన్‌లను ఏర్పాటు చేసి మందుబాబులకు వంటకాలు అందుబాటులో ఉంచుతున్నారు. అక్కడ వినియోగించే ఫుడ్‌లో కుళ్లిన ఉల్లిగడ్డలు, మసాలాలు, మాంసం, కోడిగుడ్లు తదితర వాటితో ఘుమఘుమలాడించేల వంటకాలను సర్వ్‌ చేస్తున్నారు. 
 
మందుబాబులంతా మద్యం తాగడంలోని బిజీగా మారుతుండటంతో వాళ్లకు ఎలాంటి ఫుడ్‌ సర్వ్‌ చేస్తున్నారో కూడా తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఇటీవల కొన్ని బార్స్‌ అండ్‌ రెస్టారెంట్స్‌లో కూడా అధికారులు దాడులు చేసి కిచెన్‌లో కుళ్లిన వంటకాలను గుర్తించారు.  ఓవైపు మద్యం, మరోవైపు కుళ్లిన ఆహారంతో మందుబాబుల ఆరోగ్యం గుల్ల అవ్వడం ఖాయమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. చాలా వరకు నగరంలోని బార్‌లలో ఇలాంటి దుస్థితే ఉన్నదని చెబుతున్నారు.