జైనూర్ లో  గిరిజనులు, ఆదివాసుల ఇళ్లపై దౌర్జన్యం!

జైనూర్ లో  గిరిజనులు, ఆదివాసుల ఇళ్లపై దౌర్జన్యం!
 
ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లోని  వడ్డెర కాలనీ, హరిజన కాలనీలపై ముస్లిం మూకలు దాడికి పాల్పడ్డారు. పథకం ప్రకారం వందలాది మంది ముస్లింలు వచ్చి  ప్రతి ఇంటి పై భీభత్సం సృష్టించారు. ఇంట్లో ఉన్న వస్తువులను ధ్వంసం చేశారు.  ఇంటి తలుపులను పగలగొట్టారు.  మహిళలు, పిల్లలపై దాడులు చేసారు. దీంతో వారికి రక్త గాయాలయ్యాయి. 
 
అనేకమందిని చంపేస్తామంటూ వెంటపడి తరుముతూ  కర్రలతో, రాడ్లతో చితక బాదారు. ఇలా హరిజన కాలనీలో, వడ్డెర కాలనీలో తిరుగుతూ  దాడులు చేస్తున్న వారికి మరి కొంత మంది గుంపులుగా వచ్చిన ముస్లిం యువకులు కలిసి
సుమారు వెయ్యి మందికి పైగా జైనురుకు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన మరికొందరు ముస్లింలు తోడయ్యారు.  అక్కడి వడ్డెర కాలనీ పై దాడి చేశారు.
 
లోక్ సభ ఎన్నికలు జరిగిన మధ్యాహ్నమే ఈ దాడులు జరగడంతో  అసలు కారణమేమిటో తెలియని చాలామంది భయపడి పోయి ఇంటి తలుపుల వెనుక దాక్కున్నారు. వారిని కూడా బయటికి లాగే చితకబాదారు. జైనూరు చుట్టుపక్కల గ్రామాల్లో గుర్తుతెలియని చాలామంది ముస్లింలు వచ్చి ఉంటున్నారు. వీరు ఎక్కడి వారో కూడా తెలియదు. బయటి దేశాలకు చెందిన వారు కూడా ఉండవచ్చునని అనుమానం.
 

చాలామంది మదర్సాలలో చదువుకుంటున్న విద్యార్థులు కూడా వచ్చి దాడులలో పాల్గొన్నారు. ఈ దృశ్యాలను వీడియో తీస్తున్న పోలీసులను కూడా చితకబాదారు. డ్యూటీలో ఉన్న పోలీసులు పారిపోతున్నారు. మరి కొందరు ప్రజల్ని కాపాడడం కోసం నిలబడితే వారిపై దాడులు జరిగాయి, వాళ్లకు రక్త గాయాలయ్యాయి.

ఇంత జరుగుతున్నా లాఠిచార్జ్ చేయడానికి అనుమతి లేదంటూ కేవలం చేతులతోనే నెట్టుకుంటూ వెళ్తున్నారు. కానీ ముస్లింలు “అల్లాహు అక్బర్ నారే ఈ తగ్ ధీర్ – పాకిస్తాన్ జిందాబాద్” అంటూ నినాదాలు చేస్తూ పోలీసులను సైతం కొట్టడం ఆందోళన కలిగిస్తున్నది.

వెనుకబడిన ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందిన వందలాది మంది పై దాడులు చేసిన వారందరిపై కేసుల నమోదు చేసి తగిన చర్యలు తీసుకుని బాధితులకు  న్యాయం చేయాలని విశ్వహిందూ పరిషత్ ఢిల్లీ లో జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేసింది.  కమిషన్ వెంటనే ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తగు చర్య తీసుకొని, తమకు వివరంగా నివేదిక పంపమని రాష్ట్ర డిజిపిని ఆదేశించింది. బాధితులకు తగు వైద్య సహాయం అందించామని జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ బాధితులను కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని, ఎవరికి భయపడవద్దని భరోసా ఇచ్చారు. దెబ్బలుతిన్న బాధితులు  ప్రస్తుతం భాగ్యనగర్ తో పాటు పలు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ దాడులపై పోలీసులు రెండు ఎఫ్ ఐ ఆర్ లను నమోదు చేశారు.