
తెలంగాణ సంక్షిప్త పదాన్ని `టీఎస్’కు బదులు `టీజీ’గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక నుంచి ప్రభుత్వానికి సంబంధించిన అన్ని జీవోలు, నోటిఫికేషన్లు, నివేదికలు, లెటర్ హెడ్‌లలో టీజీగా ఉండాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, స్వయం ప్రతిపత్తి విభాగాలన్నీ ఈ ఆదేశాలన్ని పాటించాలని ఆమె సూచించారు.
ఇప్పటికే వాహనాల రిజిస్ట్రేషన్లలో తెలంగాణ సంక్షిప్త పదాన్ని టీజీగా పేర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో అధికారిక సమాచారాల్లోనూ టీజీగా ప్రస్తావించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీలు,
స్వయం ప్రతిపత్తి సంస్థలు, అధికారిక హోదాలు సూచించే బోర్డుల్లో ఈ మార్పులు వెంటనే చేయాలని ఆమె స్పష్టం చేశారు.ఇక నుంచి ప్రభుత్వ కార్యాలయాల బోర్డులు, వెబ్ సైట్లు, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్‌లలోనూ టీజీ ఉండాలన్నారు. టీఎస్ అని ముద్రించిన స్టేషనరీ, ప్రింటింగ్ మెటీరియల్‌ను తొలగించి.. టీజీతో కొత్తగా ముద్రించాలని ఉత్తర్వుల్లో ఆమె . ఉత్తర్వులు అమలు చేసి ఈనెల 31 నాటికి సాధారణ పరిపాలన శాఖకు నివేదిక సమర్పించాలని వివిధ శాఖల కార్యదర్శులను సీఎస్ ఆదేశించారు.
తెలంగాణ ఉద్యమం సమయంలో సంక్షిప్తంగా టీజీని ఉపయోగించారని, వాహనాలపై కూడా నాడు ఏపీకి బదులు టీజీ అని రాసుకున్నారని ప్రభుత్వం పేర్కొంది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో తెలంగాణను సంక్షిప్తంగా టీఎస్‌గా మార్చిందని, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ప్రజల అభీష్టం మేరకు టీజీగా మారుస్తున్నట్టు స్పష్టం చేసింది.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు