
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం నుంచి సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లు మూతపడనున్నాయి. గత కొన్ని నెలలుగా టాలీవుడ్‌లో పెద్ద సినిమాలేవి విడుదల లేకపోవడం లేదు. ఓ పక్క ఎన్నికలు, మరో పక్క ఐపీఎల్ ఉండటంతో భారీ సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు వేసవి కాలం నుంచి వాయిదా వేసుకున్నారు. అయితే దీని ప్రభావం సింగిల్ స్క్రీన్ సినిమా థియేటర్లపై పడింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్‌లలో ప్రేక్షకులు రాకపోవడంతో థియేటర్స్ భారీ నష్టాలను చవిచూస్తున్నాయి. ఈ నష్టాలను పూడ్చడానికి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్ని ఓ నిర్ణయానికి వచ్చాయి. వేసవి అయిపోయే వరకు ఓ రెండు వారాల పాటు థియేటర్స్ క్లోజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. థియేటర్స్ కి జనాలు ఎవ్వరూ రావట్లేదని కారణంతోనే థియేటర్లను మూసివేస్తున్నట్లు తెలిపారు. ఈ శుక్రవారం నుంచి ఇది అమలులోకి రానున్నట్లు ప్రకటించారు. అయితే ఈ ప్రకటనపై తాజాగా తెలంగాణ స్టేట్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ స్పందించింది.
సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేయాలన్నది ఎగ్జిబిటర్ల వ్యక్తిగత నిర్ణయం అని, ఈ నిర్ణయం తీసుకునే ముందు ఎగ్జిబిటర్స్ తమను సంప్రదించలేదని ఫిలిం చాంబర్ స్పష్టం చేసింది. ఈ నిర్ణయం ఎగ్జిబిటర్స్ వ్యక్తిగతంగా తీసుకున్నారని దీనితో ఫిలిం చాంబర్ కు ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు థియేటర్స్ మూసివేయడం వలన చిన్న సినిమాలు నష్ట పోనున్నాయి. ఈ వారం గెటప్ శ్రీను రాజు యాదవ్‌తో పాటు లవ్ మీ మరిన్ని చిన్న సినిమాలు విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలకు థియేటర్స్ క్లోజ్ చేయడం వలన భారీ ఎఫెక్ట్ పడుతుందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు