ప్రధాని నరేంద్ర మోదీకి అండగా 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం ఉందని, వారి అండతోనే 400 సీట్లు గెలుచుకుంటామని హోంమంత్రి అమిత్ షా భరోసా వ్యక్తం చేశారు. 400 సీట్లతో మోదీని ఎందుకు గెలిపించాలో వారికి బాగా తెలుసని ఓ ఇంటర్వ్యూ లో తెలిపారు. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా కేంద్రంలో అధికారం చేపట్టాలంటే మ్యాజిక్ ఫిగర్ 272 సీట్లకు పైనే గెలుచుకోవాల్సి ఉంటుంది. అన్ని సీట్లు రాలేని పక్షంలో ప్లాన్ బి ఏమిటని అమిత్ షాను ప్రశ్నించగా అలా జరిగే అవకాశం తనకు కనిపించడం లేదని, ప్లాన్ బి అవసరం లేదని స్పష్టం చేశారు.
‘అలాంటి అవకాశాలు నాకు కనిపించడం లేదు. 60 కోట్ల మంది లబ్ధిదారుల సైన్యం ప్రధాని మోదీకి అండగా ఉంది. వారికి కులం, వయసుతో సంబంధం లేదు. మోదీ అంటే ఏంటి.? ఆయనకు 400 సీట్లు ఎందుకు ఇవ్వాలి..? అనేది వారికి తెలుసు. ‘ప్లాన్ ఎ’ విజయవంతమవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. పైగా, ‘ప్లాన్ ఎ’ విజయవంతం కావడానికి 60 శాతం కంటే తక్కవు అవకాశం ఉన్నప్పుడే ‘ప్లాన్ బి’ ని రూపొందించాలని చెప్పారు. తమకు ఇప్పుడు ఆ ని తాను ఖచ్చితంగా నమ్ముతున్నానని అమిత్‌షా పేర్కొన్నారు.అవసరం లేదని, ప్రధాని మోదీ అఖండ మెజారిటీతో అధికారంలోకి వస్తారని ధీమా వ్యక్తం చేశారు.
ఇదే ఇంటర్వ్యూలో రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ 400కంటే ఎక్కువ లోక్ సభ స్థానాలను గెలవాలనుకుంటుందని ప్రతిపక్షాల చేస్తున్న విమర్శలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. గత 10 ఏళ్లుగా రాజ్యాంగాన్ని మార్చేందుకు అవసరమైన మెజారిటీ తమకు ఉందని తెలిపారు. కానీ తాము ఎన్నడూ అలా చేయలేదని గుర్తు చేశారు.
దేశ రాజకీయాల్లో సుస్థిరతను తీసుకువచ్చేందుకు ఎన్డీఏ 400కంటే ఎక్కువ సీట్లను సాధించడమే లక్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. లోక్‌సభలో 400 సీట్లతో సరిహద్దులను పరిరక్షించాలని, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చాలని, పేదల సంక్షేమానికి భరోసా ఇవ్వాలని బీజేపీ కోరుకుంటోందని ఈ సందర్భంగా అమిత్ షా వివరించారు.
“దేశ సరిహద్దులను కాపాడుకోవడానికి, భారత్‌ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు, మరికొంత మంది పేదలకు భరోసా ఇవ్వడానికి 400 సీట్లను ఎన్డీఏ గెలవాలి. ఎందుకంటే ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇంకా అందలేదు. 70 ఏళ్లు దాటిన ప్రతి సీనియర్ సిటిజన్‌కు రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్యం అందించాలనుకుంటున్నాం” అంటూ అమిత్ షా వివరించారు.
రాజ్యాంగాన్ని మార్చే చరిత్ర కాంగ్రెస్ పార్టీకి ఉందని అమిత్ షా విమర్శించారు. దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హయాంలో మెజారిటీని కాంగ్రెస్ పార్టీ దుర్వినియోగం చేసింది. ఆ సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎమర్జెన్సీ విధించింది. లక్షన్నర మందిని అకారణంగా 19నెలల పాటు జైల్లో పెట్టిందని హోంమంత్రి గుర్తు చేశారు.
‘ఉత్తర-దక్షిణ విభజన’ కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని బిజెపి ఆరోపణ గురించి అడిగిన ప్రశ్నకు అమిత్ షా ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో బీజేపీ మెరుగైన పనితీరు కనబరుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. కర్ణాటకలలో కలిపి బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని తెలిపారు.“ఇది ప్రత్యేక దేశం అని ఎవరైనా చెబితే, అది చాలా అభ్యంతరకరం, ఈ దేశం ఇప్పుడు ఎప్పటికీ విభజించబడదని స్పష్టం చేశారు.
“కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక పెద్ద నాయకుడు ఉత్తర, దక్షిణ భారతదేశాన్ని విభజించడం గురించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ దానిని కూడా ఖండించలేదు.కాంగ్రెస్ పార్టీ ఎజెండా గురించి దేశ ప్రజలు ఆలోచించాలి” అని చెప్పారు.
More Stories
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు