ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై తన అధికార నివాసంలో తన వ్యక్తిగత సహాయకుడే దాడికి పాల్పడిన అంశం గురించి సమాధానం ఇవ్వకుండా ఆప్ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాటవేశారు. లక్నోలో సమాజావాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తో కలిసి ఉమ్మడిగా మీడియా సమావేశం జరిపినప్పుడు ఈ అంశం గురించి ప్రశ్నించగా సమాధానం
ఇవ్వడానికి నిరాకరించారు.
మౌనంగా మైక్రోఫోన్‌ను పాస్ చేశారు. స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ సోమవారం దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై అఖిలేష్ యాదవ్ మాట్లాడుతూ స్వాతి మలివాల్ కంటే దేశంలో ఎక్కువ సమస్యలు ఉన్నాయని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అంతకుముందు బుధవారం రాత్రి ఆమరియు మెపై ముఖ్యమంత్రి ఇంటివద్ద దాడికి పాల్పడిన బిభవ్ కుమార్ ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్‌తో కలిసి లక్నో విమానాశ్రయంలో కనిపించాడు. అంతకు ముందు రోజే ఆమెపై దాడి జరిగిన అంశాన్ని నిర్ధారిస్తే, దాడికి పాల్పడిన అతనిపై పార్టీ “కఠిన చర్యలు” తీసుకొంటుందని సంజయ్ సింగ్ హామీ ఇవ్వడం గమనార్హం.
కాగా, బుధవారం మీడియా సమావేశంలో, స్వాతి మలివాల్ అంశం గురించి ప్రశ్నించినప్పుడు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఆత్మరక్షణలో పడ్డారు. ఈ విషయంలో తాను ఇప్పటికే అవసరమైన స్పందనను అందించానని, పరిస్థితిని రాజకీయంగా ఉపయోగించుకోవద్దని కోరారురు.
మరోవంక, తన ఇంట్లోనే దాడికి పాల్పడ్డారని పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ ఆరోపించిన ఘటనలో కేజ్రీవాల్ నిందితులకు ఆశ్రయం కల్పిస్తున్నారని అంటూ బీజేపీ ఆరోపించింది. బిజెపి జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ, “… ఈరోజు అరవింద్ కేజ్రీవాల్ తన పార్టీకి చెందిన మహిళా ఎంపీని కొట్టి, అనుచితంగా ప్రవర్తించినందుకు చింతించలేదు. నిందితుడు కేజ్రీవాల్ రక్షణలో తిరుగుతున్నాడు. అతను ఎస్పీ ప్రధాన కార్యాలయంలో కూడా కనిపించాడు.” అని విమర్శించారు.
మరోవైపు, సీఎం నివాసంలో స్వాతి మలివాల్‌పై దాడికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌కు జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సిడబ్ల్యు) సమన్లు పంపింది. కేసును సుమోటోగా స్వీకరించిన మహిళా ప్యానెల్ మే 17న ఉదయం 11 గంటలకు కుమార్‌ను తమ ముందు హాజరుకావాలని కోరింది.
ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అదనపు కమిషనర్, డిసిపి నార్త్ గురువారం స్వాతి మలివాల్ ఇంటికి వెళ్లారు. కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు విభవ్ కుమార్ ఆమెతో “అసభ్యంగా ప్రవర్తించాడని” పార్టీ అంగీకరించిన ఒక రోజు తర్వాత బుధవారం, సంజయ్ సింగ్ తన సహా ఎంపీ స్వాతి మలివాల్‌ను కలిశారు. ఢిల్లీ కమీషన్ ఫర్ ఉమెన్ (డిసిడబ్ల్యు) సభ్యురాలు వందనా సింగ్ కూడా ఆయనతో ఉన్నరని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ విషయంలో మలివాల్ ఇంకా అధికారికంగా ఫిర్యాదు చేయలేదు.

More Stories
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
బెంగాల్ లో 1000కి పైగా పౌరసత్వ శిబిరాల ఏర్పాట్లలో బీజేపీ
కర్నూలు జిల్లాలో బస్సుకు దగ్ధంలో 19 మంది సజీవ దహనం