
స్టార్ క్యాంపెయినర్‌గా ప్రచారంలో పాల్గొనాల్సి ఉందని, మహిళగా పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హత ఉందని కవిత బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు. ఆధారాలు లేకుండానే కవితను అరెస్టు చేశారని ఆమె తరపు న్యాయవాది రౌస్ అవెన్యూ కోర్టులో వాదనలు వినిపించారు.
అరెస్టుకు సరైన కారణాలు లేవని వివరించారు. మరోవైపు సీబీఐ, ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ కవితకు బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఆమె బయటకు వెళ్తే దర్యాప్తును ప్రభావితం చేస్తారని పేర్కొన్నారు. మద్యం కేసులో కవితే కీలక సూత్రధారి, పాత్రధారి అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ న్యాయస్థానానికి తెలిపింది. ఇరువైపుల వాదనలు విన్న సీబీఐ ప్రత్యేక కోర్టు కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.
మే 7వ తేదీతో కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగుస్తుండగా… ఇవాళ బెయిల్ పిటిషన్లపై తీర్పు ఇచ్చింది. ఈడీ, సీబీఐ వాదనలతో ఏకీభవించిన కోర్టు కవితకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది.
More Stories
ముంబైలో అతిపెద్ద భూమి కొనుగోలు చేసిన ఆర్బీఐ
ప్రపంచ కుబేరుడిగా ఒరాకిల్ కో-ఫౌండర్ ల్యారీ
ట్రంప్ సుంకాలతో 0.5 % తగ్గనున్న జిడిపి