అయోధ్యలో కొలువు తీరిన శ్రీరాముడిని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం దర్శించుకున్నారు. ఆ క్రమంలో శ్రీరాముడికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి ముర్మ అయోధ్య ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్నారు.
ఆమెకు యూపీ గవర్నర్ అనందిబెన్ పటేల్, రాష్ట్ర మంత్రి సూర్య ప్రతాప్ షాహి స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా అయోధ్యలోని హనుమాన్ ఘారీ దేవాలయాన్ని వెళ్లి.. హనుమంతుని దర్శించుకున్నారు. అనంతరం అయోధ్యలోని రామ మందిరానికి వెళ్లారు. అయితే సాయంత్రం సూర్య మహా హరతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
అంతకుముందు సరయూ నదికి సైతం హారతి ఇచ్చారు. రామమందిరాన్ని నిర్మించాక రాష్ట్రపతి తొలిసారిగా దర్శించుకున్నారు. అయోధ్యకి వెళ్లిన భారత రాష్ట్రపతుల్లో ముర్ము మూడో వారు. అయోధ్యకు వెళ్లిన తొలి రాష్ట్రపతి జ్జానీ జైలు సింగ్. 1983లో భారత రాష్ట్రపతిగా జ్జానీ జైలు సింగ్ అయోధ్యకు వెళ్లారు. స్థానిక హనుమాన్ ఘారీ దేవాలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఇక రెండో రాష్ట్రపతి రామనాథ్ కోవింద్. 2021లో ఆయన అయోధ్యలోని రామ్ లల్లాలో రామనాథ్ కోవింద్ సందర్శించుకొని.. ప్రార్థనలు చేశారు. ఇక అయోధ్యను సందర్శించిన మూడో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.

More Stories
జమిలి ఎన్నికలకు అసెంబ్లీల ఆమోదం అవసరం లేదు
తిరుప్పరంకుండ్రం కొండపై తమిళనాడుకు సుప్రీంలో చుక్కెదురు
వక్ఫ్ ఆస్తుల రిజిస్ట్రేషన్ గడువు పొడగించం