
దూరదర్శన్ లోగో రంగును మార్చేశారు. ఆ లోగో రంగును ఎరుపు నుంచి ఆరెంజ్ రంగుకు మార్చారు. దూరదర్శన్‌కు చెందిన డీడీ న్యూస్ ఇంగ్లీష్ ఛానల్ కొత్త రంగులో ఉన్న లోగోను ప్రమోట్ చేస్తూ వీడియోను తన ఎక్స్ అకౌంట్లో పోస్టు చేసింది. విలువలు అలాగే ఉన్నాయని, కానీ మేం ఇప్పుడు కొత్త అవతారంలో దర్శనం ఇస్తున్నామని, గతంలో ఎన్నడూ లేని రీతిలో వార్తా ప్రయాణానికి స్వాగతం అని, డీడీ న్యూస్‌ను కొత్తగా అనుభవించండి అంటూ క్యాప్షన్ ఇచ్చారు.
“మా విలువలను అలాగే ఉంచుతూ.. మేము కొత్త అవతారంలో మీ ముందుకు వస్తున్నాము. మునుపెన్నడూ లేని విధంగా.. ఓ కొత్త ప్రయాణానికి సిద్ధం అవ్వండి. సరికొత్త డీడీ న్యూస్‌ని ఎక్స్‌పీరియెన్స్ చేయండి,” అని ఎక్స్ లో పోస్ట్ చేసింది డీడీ న్యూస్.
లోగో రంగును మార్చడం పట్ల తృణమూల్ ఎంపీ జవహర్ సిర్‌చర్ విమర్శలు చేశారు. ఆ లోగో రంగు తగిన విధంగా లేదంటూ ఇప్పుడు ఇది ప్రసార భారతి కాదు అని, ప్రచార భారతిగా మారిందని మాజీ సీఈవో తన పోస్టులో విమర్శించారు. గతంలో ప్రసార భారతి సీఈవోగా సిర్‌చర్ బాధ్యతలు నిర్వర్తించారు. 2012 నుంచి 2016 వరకు ఆయన డీడీ, ఆల్ ఇండియా రేడియోకు సీఈవోగా చేశారు. లోగోకు కొత్త రంగు వేయడం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినట్లు అవుతుందని ఆరోపించారు.
అయితే ప్రసార భారతి ప్రస్తుత సీఈవో గౌరవ్ ద్వివేది మాత్రం సిర్‌చర్ వ్యాఖ్యలను ఖండించారు. విజువల్ ఈస్థటిక్స్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. ఆరెంజ్ కలర్ లోగోను తయారు చేసినట్లు ఆయన చెప్పారు. “విజువల్‌గా ఆకర్షణగా ఉంటుందనే ఈ రంగును ఎంచుకున్నాము. లోగో ఒక్కటే కాదు.. ఛానెల్ లుక్స్,ఫీల్ కూడా అప్‌గ్రేడ్ అయ్యాయి. లైటింగ్, ఎక్విప్మెంట్ కూడా మారాయి,” అని చెప్పుకొచ్చారు గౌరవ్ ద్వివేది.
ఛానల్ బ్రాండింగ్, విజువల్ ఈస్తటిక్స్ ఆధారంగా కలర్‌ను ఎంపిక చేశామని, లోగో ఒక్కటే కాదు, డీడీ ఛానల్ లుక్, ఫీల్‌ను అప్‌గ్రేడ్ చేశామన్నారు. కొత్త లైటింగ్, ఎక్విప్మెంట్ను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు.
More Stories
అస్సాం రైఫిల్స్ వాహనంపై కాల్పులు.. ఇద్దరు జవాన్లు మృతి
వాతావరణ మార్పుల ప్రభావం.. ఇక ఏటా కుండపోత వర్షాలే!
అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదంపై అమెరికాలో దావా