జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు ఎన్నికల కమిషన్ షాక్ ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదు మేరకు వివరణ ఇవ్వాలని సీఈవో ముకేష్ కుమార్ మీనా బుధవారం పవన్ కు నోటీసులు ఇచ్చారు.
ఇటీవల జనసేన అనకాపల్లి వారాహి యాత్రలో సీఎం జగన్ ను ఉద్దేశించి సారా వ్యాపారి, స్కాం స్టార్, లాండ్ గ్రాబర్ అంటూ పవన్ కల్యాణ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ఏప్రిల్ 8న విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. పవన్ కల్యాణ్ ఎన్నికల కోడ్ ను ఉల్లంఘిచారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదుపై స్పందించిన సీఈవో తన వ్యాఖ్యలపై 48 గంటల్లో వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఏపీలో ముఖ్య నేతలకు ఇప్పటికే ఈసీ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత జగన్ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు. వీరిద్దరికీ కూడా ఈసీ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.

More Stories
వచ్చే 50 ఏళ్లకు ఒంటిమిట్ట ఆలయ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్
దేవాలయాలకు మొదటి సంరక్షకులు న్యాయస్థానాలే
త్వరలో టీటీడీ స్థానిక ఆలయాల్లో దశలవారీ శ్రీవారి సేవ