 
                దేశవ్యాప్తంగా పెనుసంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అరెస్ట్ చేయడంతో ఢిల్లీలోని తీహార్ జైలులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను గురువారం సిబిఐ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ కోర్టు అనుమతితో గత శనివారం ఆమెను జైలులోనే ప్రశ్నించిన సిబిఐ గురువారం అరెస్ట్ చేసింది.
 ప్రస్తుతం కల్వకుంట్ల కవిత తీహార్ జైల్‌లో జ్యూడిషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. కస్టడీలో ఉన్న కవితను ఏప్రిల్ 6న సీబీఐ విచారించింది. లిక్కర్ కేసులో పాత్రేంటి? అన్ని కోట్ల డబ్బులు ఎలా చేతులు మారాయి? ఈ మొత్తం వ్యవహారం వెనుక ఎవరెవరున్నారు?  ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పాత్రేంటి? తెరవెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు? అని చాలా లోతుగా విచారణ చేయడం జరిగింది. ఈ విచారణ అనంతరం కవితను అరెస్ట్ చేయడం జరిగింది. కాగా.. శుక్రవారం నాడు కవితను కోర్టు ముందు హాజరుపరిచే అవకాశముంది. 
గతంలో మద్యం కేసులో గతంలో కవితను హైదరాబాద్ లో సీబీఐ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలోనే ఆమెను విచారించాలని నిర్ణయం తీసుకొని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ వేసి విచారణకు సీబీఐ అనుమతి తీసుకుంది. దీంతో ఆమెను జైలులోనే గత శనివారం విచారించింది. నిజానికి ఈడీ అరెస్ట్ కంటే ముందు నుంచే… కవితకు పలుమార్లు సీబీఐ నోటీసులు ఇస్తూ వచ్చింది. అయితే సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండటంతో… కవిత విచారణకు హాజరుకాలేదు. పెండింగ్ లో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తూ…సీబీఐకి సమాచారం ఇచ్చారు కవిత. కానీ విచారణకు మాత్రం హాజరు కాలేదు.





More Stories
నిబంధనల ఉల్లంఘనల సాకుతో భీమా పరిహారం ఎగవేత కుదరదు!
త్వరలో భారత్కు మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల
అమెరికా ఆంక్షలతో రష్యా చమురుకు చెల్లింపు సమస్యలు!