దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా ఫసిపోరాలో గురువారం భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులు, సీఆర్పీఎఫ్, ఆర్మీ సంయుక్త బృందం ఓ ఉగ్రవాదిని హతమార్చింది. స్థానికంగా ఉగ్రవాది దాక్కున్నారనే సమాచారం భద్రతా బలగాలు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టి సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
ఈ క్రమంలోనే బలగాలను చూసిన ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. ప్రతిగా భద్రతా బలగాలు సైతం కాల్పులు జరుపడంతో ఉగ్రవాది ప్రాణాలు కోల్పోయాడు. అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. సదరు ఉగ్రవాది గుర్తింపు తెలియరాలేదని.. వివరాలు ఆరా తీస్తున్నట్లు పేర్కొన్నారు. సంఘటనా స్థలం నుంచి ఆయుధాలతో పాటు మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఉత్తర కశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలో పోలీసులు, భద్రతా బలగాలు అద్భుతమైన విజయాన్ని సాధించాయి. ఉగ్రవాదుల మాడ్యూల్స్‌ను భద్రతా బలగాలు ఛేదించాయి. తీవ్రవాదులకు సహకారం అందిస్తున్న ముగ్గురిని ఆయుధాలతో సహా అదుపులోకి తీసుకున్నారు. సదరు వ్యక్తులు లష్కరే తోయిబాకు చెందిన తీవ్రవాదులకు సహకారం అందిస్తున్నట్లుగా తేలింది.

More Stories
ఢిల్లీలో కురవనున్న తొలి కృత్రిమ వర్షం
ఢిల్లీలో ఇద్దరు ఐసిస్ ఉగ్రవాదుల అరెస్ట్ .. భారీ ఉగ్రకుట్ర భగ్నం
పంజాబ్ ప్రభుత్వ పాఠశాల గోడపై ఖలిస్థాన్ నినాదాలు