
‘వికసిత్ భారత్’ కలల సాకారానికి తన జీవితంలోని ప్రతి క్షణం దేశానికి అంకితం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా రేయింబవళ్లు (24/7) పని చేస్తానని, ఇది తన సంకల్పమని చెప్పారు. వికసిత్ భారత్‌ను తప్పనిసరిగా సాధిస్తామనే ధీమా తనకు ఉందని తెలిపారు.
పదేళ్ల కాలంలో మోదీ చేసిన అభివృద్ధి ఒక ట్రయిలర్ మాత్రమేనని, దేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లి, ప్రపంచంలోనే భారత్‌ను 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థాయికి తీసుకు వెళ్లాల్లి ఉందని పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురిలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ప్రచార సభలో మోదీ చెప్పారు.
పశ్చిమబెంగాల్‌లోని అధికార టీఎంసీ ప్రభుత్వంపై మోదీ విమర్శలు గుప్పించారు. కేంద్ర ప్రభుత్వ పథకాలకు మమతాబెనర్జీ సారథ్యంలోని బెంగాల్ ప్రభుత్వం ‘అవరోధాలు’ సృష్టిస్తోందని ఆరోపించారు. లబ్ధిదారుల సొమ్ముు తొలుత తమ లీడర్ల అకౌంట్లలో పడాలని టీఎంసీ కోరుకుంటోందని ధ్వజమెత్తారు. మహిళపై టీఎంసీ ప్రభుత్వం అకృత్యాలను యావద్దేశం చూసిందని సందేశ్‌ఖాలి ఉదంతాన్ని ప్రస్తావిస్తూ మోదీ పేర్కొన్నారు.
సందేశ్‌ఖాలి ఘటనలో తల్లులు, సోదరీమణులు అకృత్యాలకు గురయ్యారని, కోర్టు స్వయంగా జోక్యం చేసుకోవాల్సి వచ్చిందని చెబుతూ టీఎంసీ సిండికేట్‌దే అక్కడ రూలింగ్ కావడమే ఇందుకు కారణమని ప్రధాని విమర్శించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై దాడుల ఘటనలో విచారణ జరుగుతున్నందునే టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను ఆ పార్టీ సస్పెండ్ చేసిందని చెప్పారు.
భయభ్రాంతులను చేసే వ్యక్తులను తృణమూల్ కాంగ్రెస్ ఓపెన్ లైసెన్సులు ఇస్తోందని ప్రధాని ఆరోపించారు. ఇన్వెస్టిగేటివ్ అధికారులు వచ్చినప్పుడుల్లా టీఎంసీ వారిపై దాడులు జరిపిస్తోందని దుయ్యబట్టారు. ‘నాల్ సే జల్’ పథకం కింద ఇంటింటికీ టాప్ వ్యాటర్ అందించేందుకు కేంద్రం డబ్బులు పంపుతుంటే బెంగాల్‌లో ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని మోదీ తప్పుపట్టారు.
ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని తాము అనుకుంటే, దానిని అవినీతి, పేదప్రజల వ్యతిరేక, ఎస్సీ ఎస్టీ వ్యతిరేక టీఎంసీ ప్రభుత్వం ముందుకు సాగనీయడం లేదని మండిపడ్డారు. పేద పేషెంట్లు రూ.5 లక్షల వరకూ ఉచిత చికిత్స తీసుకోవచ్చని, కానీ ఆ స్కీమ్‌ను కూడా టీఎంసీ అమలు చేయడం లేదని చెప్పారు.
‘నాల్ సే జల్’ పథకం కింద ఇంటింటికీ టాప్ వ్యాటర్ అందించేందుకు కేంద్రం డబ్బులు పంపుతుంటే బెంగాల్‌లో ఆ పథకాన్ని సక్రమంగా అమలు చేయడం లేదని మోదీ తప్పుపట్టారు. ప్రజలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇవ్వాలని తాము అనుకుంటే, దానిని అవినీతి, పేదప్రజల వ్యతిరేక, ఎస్సీ ఎస్టీ వ్యతిరేక టీఎంసీ ప్రభుత్వం ముందుకు సాగనీయడం లేదని ధ్వజమెత్తారు. పేద పేషెంట్లు రూ.5 లక్షల వరకూ ఉచిత చికిత్స తీసుకోవచ్చని, కానీ ఆ స్కీమ్‌ను కూడా టీఎంసీ అమలు చేయడం లేదని చెప్పారు.
కాగా, జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే 370వ అధికరణను రద్దు చేయడంపై మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను మోదీ తప్పుపట్టారు. బీహార్‌లోని నవడాలో ఆదివారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ, జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం కాదా అని ప్రశ్నించారు. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన ఒక రాజకీయ కార్యక్రమంలో ఖర్గే మాట్లాడుతూ, ఇక్కడ ప్రజల వద్ద జమ్మూకశ్మీర్ అంశాన్ని ప్రధాని ప్రస్తావించడంలో ఔచిత్యం ఏమిటని ప్రశ్నించారు.
ఆయన తన ప్రసంగంలో 370వ అధికరణను పొరపాటున 371వ అధికరణగా పేర్కొనడం కూడా ఆసక్తికర చర్చకు దారితీసింది. ఖర్గే చేసిన వ్యాఖ్యలను ప్రధాని బీజేపీ ఎన్నికల ప్రచార సభలో తప్పుపట్టారు. ”జమ్మూకశ్మీర్ అంశం ప్రస్తావనకు తగదని ఆయన (ఖర్గే) అనుకుంటారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి పదవి అంటే చిన్న పదవేమీ కాదు. రాజస్థాన్ వచ్చి 370వ అధికరణను ప్రస్తావించాల్సిన అవసరం ఏముందని ఆయన అనడం సిగ్గుచేటైన వ్యవహారం. జమ్మూకశ్మీర్ భారత్‌లో భాగం కాదా?” అని మోదీ నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తగా వినాలని, బీహార్‌కు చెందిన ఎందరో యువకులు, సాహసికులు తమ మాతృభూమి కోసం, జమ్మూకశ్మీర్‌ను రక్షించేందుకు ప్రాణాలు పోగొట్టుకుని అమరులయ్యారని, రాజస్థాన్‌లోనూ ఎంతోమంతి ఆత్మబలిదానాలు చేశారని ప్రధాని గుర్తు చేశారు. ఇప్పుడు కొందరు దేశంలోని ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి సంబంధం ఏమిటని అడుగుతున్నారని, ఇది టుక్డే-టిక్డే గ్యాంగ్ భాషకాకపోతే మరేమిటిని ప్రశ్నించారు. ఇలాంటి వ్యక్తులను క్షమించవచ్చా? అని సభికులను ఉద్దేశించి మోదీ ప్రశ్నించగా, పలువురి ”లేదు” అంటూ సమాధానం ఇచ్చారు.
More Stories
ఐశ్వర్య ఫొటోలు వాడితే కఠిన చర్యలు
తిరిగి రాజరికం వైపు నేపాల్ చూస్తున్నదా?
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు