
దక్షిణ భారతదేశంలో ప్రధాన జలాశయాల నీటి మట్టాలు ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయని కేంద్ర జల కమిషన్ హెచ్చరించింది. తెలంగాణ-ఏపీ సరిహద్దుల్లోని నాగార్జున సాగర్, శ్రీశైలం డ్యామ్‌లకు ప్రమాద ఘంటికలు మోగించింది. నీటి నిల్వ సామర్థ్యం కంటే సాగర్‌లో, శ్రీశైలంలో అధిక లోటు కనిపిస్తోందని కమిషన్ తన నివేదికలో హెచ్చరించింది.
బెంగళూరును ఇప్పుడు అల్లాడిస్తున్న నీటి కరువు రానున్న కాలంలో దక్షిణాదిలోని మిగతా నగర ప్రాంతాలనూ తాకనున్నదని హెచ్చరించిన ఈ అధ్యయనం, కేరళలో మాత్రమే డ్యామ్‌లు నిర్దిష్ట జలప్రమాణాలతో ఉన్నాయని తెలిపింది. కర్ణాటక, తమిళనాడు, ఏపీ, తెలంగాణలో ప్రధాన డ్యామ్‌ల్లో నీటి నిల్వ సామర్థ్యం కంటే 25 శాతం లోటు నెలకున్నదని కమిషన్ వివరించింది.
దీంతో, రానున్న నెలల్లో నీటికి తీవ్ర కొరత ఉంటుందేమో నన్న భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇక.. కర్ణాటకలోని తుంగభద్రలో ఐదు శాతం, తమిళనాడులోని మెట్టూరులో 30% మేర సామర్థ్యం కంటే లోటు కనిపిస్తోంది. గతేడాదితో పోల్చితే 17%, గత పదేళ్లతో పోల్చితే తొమ్మిది శాతం అధిక లోటు నమోదయిందని తెలిపింది.
ఇక.. దేశమంతటా ఉన్న ముఖ్యమైన 150 డ్యామ్‌ల్లో సామర్థ్యం కంటే 38% లోటు నెలకొన్నదని పేర్కొంది. అయితే, దక్షిణాదితో పోల్చదగిన నీటి ఎద్దడి సమస్యలు తక్కిన భూభాగాల్లో కనిపించడం లేదని తెలిపింది. ఈమేరకు తన వారాంతర బులెటిన్‌ను కమిషన్ విడుదల చేసింది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్