సంగారెడ్డి జిల్లా బల్లారం పారిశ్రామికవాడలో డ్రగ్స్ కలకలం రేపింది. డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డిసిఎ), ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్టుమెంట్ సంయుక్తంగా ఆపరేషన్ నిర్వహించారు. భారీగా డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం చేసు కున్నారు. మొత్తంగా రూ.8.99 కోట్ల రూపాయల విలువచేసే డ్రగ్స్‌ను అధికారులు స్వాధీనం పరుచుకున్నారు.
సంగారెడ్డి పరిధిలోని ఐడిఎ బొల్లారంలోని ఫ్యాక్టరీలో డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా ఇంటర్ పోల్ సమాచారం రావడంతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటర్ పోల్ సహాయంతో పిఎస్‌ఎన్ మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం సోదాలు చేపట్టారు. నిషేధిత డ్రగ్స్ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. 90 కిలోల మెపిడ్రిన్ డ్రగ్స్‌ని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్వాధీనపరుచుకున్నారు.గత పది సంవత్సరాల నుంచి డ్రగ్స్ తయారు చేసి విదేశాలకి తరలిస్తున్న సదరు సంస్థ డైరెక్టర్ కస్తూరి రెడ్డి నెమల్లపూడిని అరెస్టు చేశారు. సిగరెట్ ప్యాకెట్లలో డ్రగ్స్‌ను పెట్టి విదేశాలకు తరలిస్తు న్నట్లు గుర్తించారు. మరోవైపు హైదరాబాదులో కూడా డ్రగ్స్ సప్లై చేసినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్ పోల్ సహాయంతో డ్రగ్స్ రాకెట్టు గుట్టురట్టు చేసినట్లు వి.బి.కమలాసన్ రెడ్డి వెల్లడించారు.
పీఎస్‌ఎన్ కంపెనీ పలు దేశాలకు డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నట్లుగా సమాచారం. ప్రధానంగా ఐరోపాకు భారీ మొత్తంలో డ్రగ్స్‌ను సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, పోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకుం టున్నా, మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న మాఫియా చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి చాపకింద నీరులా తమ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూనే పోతుండటం గమనార్హం.
డబ్బుల కోసం భావితరాల యువ తను ఈ డ్రగ్స్ ముఠాలు నాశనం చేస్తున్నారు. ఉడుకు రక్తం యువత ఆ మత్తుకు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకోవడంతో పాటు దేశ ద్రోహులుగా కూడా మారుతున్నారు.. డ్రగ్స్ మాఫియాలు తమ స్వప్రయోజనాలకు యువతను బానిసలుగా మారుస్తున్నాయి. మాదకద్రవ్యాల బారిన పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పోలీసులు, నిపుణులు పదే పదే సూచిస్తున్నారు. హెచ్చరిస్తున్నారు కూడా.
More Stories
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత
కాళేశ్వరం రూ. లక్ష కోట్ల అవినీతిపై సిబిఐ విచారించాలి