తమిళనాడుకు చెందిన అమ్మ మక్కల్ మున్నేట్ర కజగం (ఏఎంఎంకే) బీజేపీతో పొత్తు పెట్టుకున్నది. లోక్సభ ఎన్నికల్లో రెండు స్థానాల నుంచి పోటీ చేయనున్నది. శశికళ మేనల్లుడైన టీటీవీ దినకరన్ ఈ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు. 2017లో అన్నాడీఎంకే నుంచి విడిపోయిన ఆయన ఏఎంఎంకే పార్టీని ఏర్పాటు చేశారు.
కాగా, బీజేపీ తమ పార్టీకి ఎక్కువ సీట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని దినకరన్ తెలిపారు. అయితే తమ పార్టీకి రెండు సీట్లు చాలని చెప్పామని పేర్కొన్నారు. తమకు సీట్ల సంఖ్య పట్టింపు లేదన్న దినకరన్, ఎన్డీయే గెలుపే ప్రధానమని చెప్పారు. కుక్కర్ ఎన్నికల గుర్తు కోరామని, ఈసీ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.
అయితే లోక్సభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారా లేదా అన్నది స్పష్టం చేయలేదు. మరోవైపు అన్నాడీఎంకేపై దినకరన్ మండిపడ్డారు. కొంత మంది స్వార్థ ప్రయోజనాల వల్ల ఆ పార్టీ రోజు రోజుకు బలహీనపడుతోందని విమర్శించారు. ఎడప్పాడి కే పళనిస్వామి (ఈపీఎస్)పై పరోక్షంగా ఆరోపణలు చేశారు.

More Stories
బీహార్ లో అన్ని ఎన్నికల రికార్డ్లను బ్రేక్ చేస్తాం
వందేళ్లైనా జంగల్ రాజ్యాన్ని బిహార్ ప్రజలు మరిచిపోరు
కొత్త సీజేఐ నియామకంపై కసరత్తు!