సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ఎగ్జామ్ వాయిదా

సివిల్ స‌ర్వీసెస్ ప్రిలిమిన‌రీ ఎగ్జామ్‌ను వాయిదా వేస్తున్న‌ట్లు యూపీఎస్సీ ప్ర‌క‌టించింది. లోక్‌స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో మే 26న నిర్వ‌హించాల్సిన రాత‌ప‌రీక్ష‌ను జూన్ 16వ తేదీకి వాయిదా వేసిన‌ట్లు తెలిపింది. సివిల్ స‌ర్వీసెస్ అభ్య‌ర్థులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని యూపీఎస్సీ కోరింది
 
సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ upsc.gov.in లోని అధికారిక నోటిఫికేషన్ చూడవచ్చు. ఇండియన్‌ సివిల్‌ సర్వీసుల్లో 1,056 పోర్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ పరీక్షకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రిలో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 
 
మార్చి రెండో వారం వ‌ర‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల‌ను స్వీక‌రించారు.  రాబోయే సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ కారణంగా సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) పరీక్ష – 2024 ను మొదట 2024, మే 26వ తేదీన నిర్వహించాలని నిర్ణయించారు. కానీ, అదే తేదీన లోక్ సభ ఎన్నికల ఆరో విడత ఎన్నికలు జరగనున్నాయి. దాంతో సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షను మే 26 నుండి జూన్ 16 కు వాయిదా వేయాలని యూపీఎస్సీ నిర్ణయించింది.
యుపిఎస్‌సి మెయిన్స్ అక్టోబర్ 19న నిర్వహించనున్నారు. డిగ్రీ ఉత్తీర్ణులైన లక్షల మంది అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకున్నారు.