దక్షిణాదిన ఎన్డీయేకు 38 సీట్లు

* ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్
 
2024 పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిన బీజేపీ కాస్త మెరుగుపడే అవకాశాలు కనిపిస్తున్నట్లు ఇండియా టీవీ సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ సర్వే వెల్లడించింది.
ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ 2019 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోనుందని అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే ఫలితాలు వెల్లడించాయి.
 
గత ఎన్నికలలో కేవలం కర్ణాటక, తెలంగాణాలలో 29 సీట్లు మాత్రమే గెల్చుకోగా, ఈ సారి తమిళ నాడు, మొదటిసారిగా కేరళలో సహా మొత్తం 38 సీట్లు బిజెపి నేతృత్వంలోని ఎన్డీయే గెల్చుకొనే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. దక్షిణాదిన మొత్తం 130 సీట్లు ఉన్నాయి. కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి 60 సీట్లు వస్తే, ఇతర పార్టీలకు మరో  32 సీట్లు గెల్చుకొనే అవకాశం ఉంది. 
ఇక, ఆంధ్రప్రదేశ్‌లో పోటీ మొత్తం వైసీపీ, టీడీపీ మధ్యనే ఉండవచ్చునని ఇండియా టీవీ – సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 15 సీట్లు, తెలుగుదేశం పార్టీ 10 సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వేలో వెల్లడైంది.  2019 లోక్ సభ ఎన్నికల్లో 25 సీట్లకు గాను వైసీపీ 22, టీడీపీ 3 స్థానాల్లో గెలిచాయి. కానీ ఈసారి వైసీపీ 7 సీట్లు కోల్పోవచ్చునని, అవి టీడీపీ ఖాతాలో పడే అవకాశముందని సర్వే ఫలితాల్లో వెల్లడైంది.
 
కేరళలో మొదటిసారిగా 3 ఎంపీ సీట్లను గెలుచుకున్నట్లు వెల్లడించింది. తమిళనాడులో 5 సీట్లు, తెలంగాణాలో మరో 5 సీట్లతో పాటు, కర్ణాటకలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీయేకు 24 సీట్లు రాగలవని భావిస్తున్నారు. కర్ణాటకలో మాత్రమే గత ఎన్నికల నాటికన్నా 2 సీట్లు తక్కువగా రానున్నాయి.
కేరళ, తమిళనాడులో గతంలో బీజేపీ ఒక్క సీటూ గెలుచుకోలేదు.

కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ గతంలో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 22 స్థానాలు గెలిచే అవకాశముందని విశ్లేషించింది. మొత్తంమీద దక్షిణాదిన బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో డీఎంకే నేతృత్వంలోని కూటమి గత ఎన్నికల్లో 39 సీట్లు గెల్చుకోగా, ఈ పర్యాయం 30 సీట్లకే పరిమితం కానున్నది. ఎన్డీయేకు 5, అన్నాడీఎంకేకు మరో 4 సీట్లు వచ్చే అవకాశం ఉంది. గత ఎన్నికలలో అన్నాడీఎంకే 1 సీట్ మాత్రమే గెలుచుకుంది.

ఏ రాష్ట్రంలో ఏ పార్టీకి ఎన్ని ఎంపీ సీట్లు?

ఆంధ్రప్రదేశ్ మొత్తం లోక్ సభ సీట్లు 25
వైసీపీ.           15
తెలుగుదేశం.  10

తెలంగాణలో మొత్తం ఎంపీ స్థానాలు 17
కాంగ్రెస్ 9
బీజేపీ 5
బీఆర్ఎస్ 2 సీట్లు
ఇతరులు 1 సీటు

కేరళలో మొత్తం సీట్లు: 20
యూడీఎఫ్: 11
ఎల్డీఎఫ్: 06
బీజేపీ: 03

తమిళనాడులో మొత్తం సీట్లు: 40
డీఎంకే: 20
కాంగ్రెస్: 06
బీజేపీ: 05
అన్నాడీఎంకే: 04
ఇతరులు: 05

కర్ణాటకలో మొత్తం సీట్లు: 28
బీజేపీ: 22
కాంగ్రెస్: 04
జేడీఎస్: 02