
ఆయా కుటుంబ సభ్యులందరికీ ఇలాంటి డాక్యుమెంట్లు ఉన్నప్పటికీ ఈ ధ్రుప పత్రాలు అందించాల్సి ఉందని, దీనివల్ల రిజర్వేషన్ ఫలితాలు అందరికీ అందుతాయని చెప్పారు. ఉద్యోగాల్లోను, చదువుల్లోను మరాఠా కోటా కల్పించాలన్న డిమాండ్ల సాధనకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాడానికి ముంబై మార్చ్ చేపడతామని ప్రకటించడం, ముంబైలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కావడం ఈ రెండూ ఒకేసారి కావడంతో మనోజ్ జారంగే తన దీక్షను విరమించడానికి నిర్ణయం తీసుకున్నారు.
గత వారం మహారాష్ట్ర అసెంబ్లీ ఉభయసభలు మరాఠా కమ్యూనిటీకి చదువుల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ ఏకగ్రీవంగా తీర్మానించాయి. అయితే ఒబిసి కేటగిరిలో ఉన్న మరాఠా కమ్యూనిటీకి కూడా ఉద్యోగాల్లో, చదువుల్లో 10 శాతం ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 10 నుంచి జల్నా జిల్లా అంతర్వాలి సారధి గ్రామంలో జారంగే నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ రోజు తాను నిరవధిక నిరాహార దీక్ష విరమించినప్పటికీ తనకు బదులుగా ముగ్గురు లేదా నలుగురు నిరాహార దీక్ష కొనసాగిస్తారని జారంగే తెలిపారు. తాను కూడా కొన్ని గ్రామాలకు వెళ్లి తన వైఖరిని ప్రజలకు వివరిస్తానని చెప్పారు. హోం శాఖ ఆంక్షలు విధించినందున అంతర్వాలి సారది గ్రామానికి వచ్చి తనను చాలా మంది కలుసుకోలేక పోతున్నారని తెలిపారు.
కోటా ఉద్యమంపై అనేక ఫిర్యాదులు పోలీస్‌లకు వెళ్లాయనగా, తనను విచారించడానికి తనవద్ద ఎలాంటి సమస్యలు లేవని, కానీ వారు ఏదోవిధంగా ఇబ్బందులు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని జారంగే చెప్పారు. ప్రజలు ఆగ్రహిస్తే సిఎం, హోం మంత్రి తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు.
మరోవంక, ఉపముఖ్యమంత్రి ఫడ్నవీస్ బ్రాహ్మణ కులస్థుడని, తనను చంపేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ జారాంగే ఆదివారం కొన్ని ఆరోపణలు చేయడంపై ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే జారంగేను తీవ్రంగా హెచ్చరించారు. తమ ప్రభుత్వ సహనం పరీక్షింపవద్దని స్పష్టం చేశారు. శాంతి భద్రతలకు భంగం కలిగించేటట్లు వ్యవహరిస్తే తమ ప్రభుత్వం ధృడంగా వ్యవహరించాల్సి వస్తుందని తేల్చి చెప్పారు.
More Stories
చిప్స్ ఐనా, ఓడలైనా స్వావలంబన తప్ప మార్గం లేదు
టీ20లో వేగంగా 100 వికెట్ల తీసిన బౌలర్గా అర్షదీప్
సామ్ పిట్రోడా పాకిస్థాన్ వ్యాఖ్యలపై రాజకీయ చిచ్చు