
రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ సైబీరియన్ పీనల్ కాలనీ జైలులో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పద రీతిలో మృతిచెందిన విషయం తెలిసిందే. నావల్నీ మృతికి గల కారణాలు మాత్రం ఇప్పటివరకూ ఎవరికీ తెలియవు. అయితే, ఆయన్ని రష్యా అధ్యక్షుడు పుతినే హత్య చేయించాడని ఆరోపణలు వెల్లుకిన్ తాజాగా కీలక విషయాన్ని వెల్లడించారు.
నావల్నీని కేజీబీ ఉపయోగించే ఒక సిగ్నేచర్ టెక్నిక్‌తో హతమార్చినట్లు ఆరోపించారు. అతడి గుండెపై ఓ పంచ్ విసరడంతో నావల్నీ చనిపోయి ఉండొచ్చని చెప్పారు. కేజీబీ ఓ ప్రభుత్వ ఏజెన్సీ. సోవియట్ కాలం నాటి అంతర్గత భద్రతా సేవ. దీన్ని డిసెంబర్ 3, 1991న అధికారికంగా రద్దు చేశారు.
ఆ తర్వాత రష్యాలో ఫారిన్ ఇంటెలిజెన్స్ సర్వీస్‌గా, ఆతర్వాత ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్‌గా మారింది. అప్పట్లో కేజీబీ ఏజెంట్లకు ఒక వ్యక్తి గుండెపై గట్టిగా కొట్టడం ద్వారా చంపే ట్రైనింగ్ ఇచ్చేవారని వ్లాదిమిర్ ఒసెచ్కిన్ తెలిపారు. తాజాగా నావల్నీని చంపేందుకు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించి ఉంటారని ఆయన ఆరోపించారు.
‘ముందుగా నావల్నీ శరీరాన్ని బలహీన పరిచేందుకు కఠినమైన శీతల ఉష్ణోగ్రతలో గంటల తరబడి నిలబెట్టి ఉంటారు. దీని ద్వారా అతని రక్త ప్రసరణ కనిష్ట స్థాయికి తగ్గించి శరీరాన్ని మొదట నాశనం చేసి ఉంటారని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత కేజీబీ పాత పద్ధతి అయిన గుండెపై ఒక పంచ్‌తో అతన్ని హత్య చేసి ఉంటారు’ అని వ్లాదిమిర్ ఒసెచ్కిన్ ఆరోపించారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము
అవినీతిపై పోరాడతా, ఉద్యోగాలు కల్పిస్తా