బ్రిటన్‌ రాజు చార్లెస్‌కు క్యాన్సర్‌

బ్రిటన్ రాజు చార్లెస్-3కి క్యాన్సర్ నిర్ధారణ అయ్యిందని బకింగ్ హాం ప్యాలెస్  వెల్లడించింది. ఈ విషయాన్ని బ్రిటన్ రాజకుటుంబం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే అది ప్రొస్టేట్ క్యాన్సర్ కాదని రాజుకు ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వైద్య పరీక్షల్లో వ్యాధి బయటపడినట్లు తెలిపింది. 
 
అయితే అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడించలేదు. ఆయన సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని వెల్లడించింది. త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. కాగా, కింగ్ చార్లెస్ త్వరగా కోలుకోవాలని బ్రిటన్ ప్రధాని రిషి సునక్ ఆకాంక్షించారు. ‘రాజు త్వరగా, పూర్తిగా కోలుకోవాలి.. ఏ సమయంలోనైనా పూర్తి శక్తితో తిరిగి వస్తాడనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు.. దేశం మొత్తం అతనికి శుభాకాంక్షలు తెలుపుతుందని నాకు తెలుసు’ అని సునాక్ ట్వీట్ చేశారు.
ఇక రాజు ఆరోగ్యంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎక్స్ లో ఒక పోస్ట్‌లో, బిడెన్ ఇలా చెప్పారు: “క్యాన్సర్ నిర్ధారణ, చికిత్స, మనుగడ కోసం నావిగేట్ చేయడానికి ఆశ, సంపూర్ణ ధైర్యం అవసరం. హిజ్ మెజెస్టి త్వరగా,  పూర్గా కోలుకోవాలని ప్రార్థిస్తూ యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజలతో జిల్, నేను చేరాము.” 
బిడెన్ కుమారుడు, బ్యూ, 46 సంవత్సరాల వయస్సులో మెదడు క్యాన్సర్‌తో మరణించాడు. బిడెన్ చిరకాల స్నేహితుడు, రిపబ్లికన్ సెనేటర్ జాన్ మెక్‌కెయిన్ కూడా 2018లో క్యాన్సర్‌తో మరణించారు. చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆకాంక్షించారు. ‘చార్లెస్‌-3 త్వరగా కోలుకోవాలి. సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటున్నాం’ అని ట్వీట్‌ చేశారు.
 
75 ఏండ్ల చార్లెస్‌-3 తన తల్లి క్వీన్ ఎలిజబెత్ మరణంతో 2022, సెప్టెంబర్‌ 8న రాజుగా బాధ్యతలు చేపట్టారు. 2023, మే 6న పట్టాభిషేకం చేశారు. కాగా,
తన ఆరోగ్యం వస్తున్న వదంతులు, ఊహాగానాలకు తెరదించడానికి, ప్రపంచవ్యాప్తంగా కేన్సర్ బారిన పడిన వారందరికీ అవగాహనకు తోడ్పడుతుందనే ఉద్దేశంతో కింగ్ ఛార్లెస్-3 ఈ ప్రకటన చేసినట్టు కింగ్ చార్లెస్ ప్రతినిధి తెలియజేశారు. ప్రస్తుతం ‘ఔట్‌డోర్ పేషంట్’గా చికిత్స పొందుతున్నారని వెల్లడించారు.

‘గత నెలలో ప్రొస్టేట్ గ్రంథి సమస్య కోసం మూడు రోజుల పాటు ఛార్లెస్-3 ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. ఈ సమయంలోనే ఆయనకు కేన్సర్ నిర్ధారణ అయ్యింది. ఆయనకు సాధారణ చికిత్స ప్రారంభించారు. ఈ సమయంలో విధులను వాయిదా వేయమని వైద్యులు సలహా ఇచ్చారు. ఈ వ్యవధిలో యథావిధిగా ప్రభుత్వ, అధికారిక పనులు కొనసాగిస్తారు. చికిత్స చేస్తున్న వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. చికిత్స గురించి పూర్తి సానుకూలంగా ఉన్నారు. వీలైనంత త్వరగా సాధారణ విధులకు రావాలని ఎదురు చూస్తున్నారు’ అని బకింగ్‌హమ్ ప్యాలెస్ వెల్లడించింది.

ఇక, తండ్రి కేన్సర్ బారినపడ్డ విషయం తెలియడంతో ఆయన చిన్న కుమారుడు ప్రిన్స్ హ్యారీ త్వరలోనే లండన్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. మూడేళ్ల కిందట రాజకుటుంబం నుంచి విడిపోయిన హ్యారీ ప్రస్తుతం తన భార్య మేఘన్ మార్కెల్, ఇద్దరు పిల్లలతో కలిసి అమెరికాలో ఉంటున్న విషయం తెలిసిందే. వార్త తెలిసిన వెంటనే తండ్రికి ఫోన్ చేసిన మాట్లాడిన ఆయన లండన్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు.
తన అనారోగ్యంన్ని బహిర్గతం పరచడం ద్వారా “క్యాన్సర్ ఎలా విచక్షణారహితంగా ఉంది” అని వెల్లడించినందుకు  రాయల్ సొసైటీ ఆఫ్ మెడిసిన్ రాజుకు కృతజ్ఞతలు తెలిపింది. క్యాన్సర్ స్క్రీనింగ్‌లకు అర్హులైన ప్రజలు  అపాయింట్‌మెంట్ తీసుకోవాలని కోరారు. “దయచేసి మా వద్ద సిగ్గుపడకండి. మరింత సమాచారం ఉంటే సహాయం చేయడం మంచిది. కాన్సర్ ను తోసిపుచ్చండి లేదా, మిమ్మల్ని  అనుకూలమైన చికిత్స చేయించుకోండి,” అని సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ జయ్ వర్మ ప్రజలకు సూచించారు.