మిలిటెంట్లకు చెందిన కమాండ్ కంట్రోల్ ప్రధాన కేంద్రంతోపాటు ఇంటెలిజెన్స్ కేంద్రాలు, రాకెట్లు, క్షిపణులు, డ్రోన్లు, ఆయుధ సామాగ్రి నిల్వల గోడౌన్లు, లాజిస్టిక్స్ సౌకర్యాలపై దాడులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. జోర్డాన్‌లోని అమెరికా సైనిక క్యాంప్‌పై ఇటీవల డ్రోన్ దాడి జరిగిన విషయం తెలిసిందే.
ఇందులో ముగ్గురు అమెరికా సైనికులు మృతిచెందగా, సుమారు 40 మంది గాయపడ్డారు. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ దాడులు జరిగినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ పేర్కొంది.
అమెరికన్లకు ఎవరైనా హాని కలిగిస్తే, తాము తగిన సమాధానం ఇస్తామని ఈ దాడుల తరువాత అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఓ ప్రకటనలో హెచ్చరించారు. గత ఆదివారం జోర్డాన్‌లో ఇరాన్ మద్దతుగల ఉగ్రవాద గ్రూపులు జరిపిన డ్రోన్ దాడిలో ముగ్గురు అమెరికా సైనికులు మరణించారని ఆయన చెప్పారు.

More Stories
‘మిస్టర్ సింగ్’ పోస్టర్ తో ట్రంప్ బృందం జాత్యాహంకార వ్యాఖ్యలు
జెలెన్స్కీ విమానాన్ని దాదాపు ఢీకొట్టిన డ్రోన్?
ఇరాన్ చేతికి అమెరికా అత్యాధునిక మానవరహిత జలాంతర్గామి ‘డైవ్ ఎల్డీ’?